హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం 20 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులతో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆ కుటుంబం ఏది?
చైనా దేశంలో 20 వేల మందికిపైగా నివసిస్తున్న ఓ ఆకాశ హర్మ్యం ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనంగా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ భవనం ఏ నగరంలో ఉంది?
అక్టోబర్ 1న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒకరు తన వందో పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ ఘనత సాధించిన తొలి అధ్యక్షుడిగా ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన ఎవరు?
మెక్ ఆర్థర్ ఫౌండేషన్ నుంచి సుమారు 6.7 కోట్ల రూపాయల విలువైన “జీనియస్” గ్రాంట్ ఫెలోషిప్ దక్కించుకున్న భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ ఎవరు?
రెస్టాఫ్ ఇండియా జట్టును ఓడించి ముంబై జట్టు దేశవాళీ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఇరానీ ట్రోఫీని దక్కించుకుంది. గతంలో ముంబై జట్టు ఏ సీజన్లో ఇరానీ ట్రోఫీ గెలుచుకుంది?
ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్… అంటూ తనదైన సిగ్నేచర్ డ్యాన్స్‌తో ప్రముఖ నటుడు మిథున్ చక్రబర్తి 1980వ దశకంలో యువతరాన్ని ఉర్రూతలూగించాడు. ఆయనకు 2022 ఏడాదికిగాను ప్రసిద్ధ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించారు. ఆయన అసలు పేరేంటి? ఏ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు?
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలిచిన స్పెయిన్ జట్టులో ఒకరైన దిగ్గజ ఆటగాడు ఇటీవల ఆటకు వీడ్కోలు పలికాడు.
ప్రపంచంలోనే మేటి మిడ్ ఫీల్డర్‌గా పేరుగాంచిన ఆ ఆటగాడు ఎవరు?
దక్షిణ కొరియాలో తాజాగా నిర్వహించిన ‘మిస్ యూనివర్స్ కొరియా’ పోటీల్లో యువతులతో పోటీపడి మరీ ఓ 81 ఏండ్ల బామ్మ సందడి చేశారు. తృటిలో అందాల కిరీటం కోల్పోయిన ఆ బామ్మ బెస్ట్ డ్రెస్సర్ అవార్డు దక్కించుకున్నారు. ఆమె పేరేంటి?
భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన సైనికాధికారి ఎవరు?
మారిషస్.. హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపాల సముదాయం. అయితే ఇటీవల యునైటెడ్ కింగ్డం కొన్ని దీవులను మారిషస్‌కు తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ దీవులు ఏవి?