పాకిస్తాన్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ ఒకరు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. ఆ దేశం నుంచి అంపైర్ల ప్యానెల్‌కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రికార్డు సాధించిన ఆ క్రీడాకారిణి ఎవరు?
సెప్టెంబర్ 12 నాడు స్పేస్ ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్‌లో తొలిసారిగా ఇద్దరు ప్రైవేటు వ్యోమగాములు స్పేస్‌వాక్ చేశారు. ఈ ఇద్దరిలో ‘షిఫ్ట్4’ అనే ఎలక్ట్రానిక్ చెల్లింపుల కంపెనీ వ్యవస్థాపకుడు కూడా ఉన్నారు. ఆయన ఎవరు?
‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’ లాంటి 200కుపైగా సినీ గీతాల రచయిత గురుచరణ్ ఇటీవల మరణించారు. ఆయన అసలు పేరేంటి?
దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన ఓ టైఫూన్ (తుఫాన్) కారణంగా ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్
చిగురుటాకులా వణికిపోయింది. వందలాది మంది మరణం, వందల కోట్ల డాలర్ల నష్టానికి కారణమైన ఆ టైఫూన్ పేరేంటి?
భారతీయుల విశేష ఆదరణ పొందిన విదేశీ వంటకాల్లో ఇటాలియన్ డిష్ పిజ్జా ఒకటి. గ్లోబల్ పిజ్జా మ్యాప్ ర్యాంకుల్లో భారతదేశానికి చెందిన ఓ పిజ్జా తయారీ సంస్థ ప్రపంచ జాబితాలో 86వ స్థానం దక్కించుకుంది. టాప్ 100 లిస్టులో చేరిన ఆ సంస్థ ఏది?
సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్పగా భావిస్తారు. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు తనకున్న అన్ని సోషల్ మీడియా ఖాతాలను కలుపుకొని 100 కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు.
ఈ ఘనత సాధించిన తొలివ్యక్తిగా వార్తల్లో నిలిచిపోయాడు. అతనెవరు?
బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవులకూ.. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తగిన పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏ పేరు పెట్టారు?
సైకిల్‌పై అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా ఒకరు ఇటీవల వార్తల్లో నిలిచారు. 108 రోజుల 12 గంటల 12 నిమిషాల్లో 29,169 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సాధించిన ఆ ఆమెరికన్ సైక్లిస్ట్ ఎవరు?
సినీనటులు సిద్ధార్థ్, అదితి రావు హైదరి వివాహం సెప్టెంబర్ 16న జరిగింది. ఈ వేడుక జరిగిన ప్రదేశం
శిల్పకళా నైపుణ్యానికి నెలవైన ఓ దేవాలయం కావడం విశేషం. ఆ ఆలయం పేరు ఏమిటి? ఎక్కడ ఉంది?
‘ద మ్యుటెంట్’ అనే ముద్దుపేరుతో ప్రసిద్ధుడైన ప్రపంచంలోనే అత్యంత భారీ బాడీ బిల్డర్ ఇటీవల
గుండెపోటుతో మరణించాడు. ఎన్నడూ పోటీల్లో పాల్గొనని ఆ కండలరాయుడి పేరేంటి?