దూరదృష్టి.. కచ్చితమైన కసరత్తు
తెలంగాణ సాధకుడు కేసీఆర్ రాష్ట్ర తొలి ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, పరిపాలనను ప్రజలకు సౌలభ్యం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ఆ హామీని నెరవేర్చారు.
తెలంగాణను సాధించడం ఒక ఎత్తు.. సాకారమైన రాష్ర్టాన్ని అగ్రపథాన నిలపడం మరో ఎత్తు. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఈ రెండు అంశాల్లోనూ సఫలీకృతుడయ్యారు. తెలంగాణ ఆవిర్భవించిన మరుక్షణం నుంచే.. రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలో మేధోమథనం ప్రారంభించారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని హామీగా పేర్కొన్నారు కేసీఆర్. అందుకు తగ్గట్టే.. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఈ కమిటీ అధికారుల స్థాయిలో చర్చలు చేపట్టింది. ఇదే లక్ష్యంతో ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిరంతరం చర్చలు జరిపింది.
1974 చట్టం కింద జిల్లాల రీ ఆర్గనైజింగ్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇదంతా ఆగమేఘాల మీద జరిగినట్టు కనిపించినా.. దీని వెనుక కేసీఆర్ విజన్ ఎంతో ఉంది. కమిటీ రిపోర్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తగు సూచనలు చేస్తూ… ప్రజలంతా ఆమోదించేలా ముసాయిదా రూపొందించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి.. అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకొని కసరత్తు పూర్తి చేశారు.
‘ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ ప్రతిపాదనలు ఫైనల్ అని ఎవ్వరూ అనుకోవద్దు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన ఉంటది’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే… ముసాయిదాను ప్రజా క్షేత్రంలో ఉంచి.. అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి.. 2016 అక్టోబర్ 11న విజయ దశమి సందర్భంగా ఏకకాలంలో 31 జిల్లాలను మనుగడలోకి తీసుకొచ్చారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే దఫాలో ఇన్ని జిల్లాలు ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. ఈ క్రమంలో ఒకే రోజు దాదాపు 1200 జీవోలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ ప్రక్రియను అంతా తానై నడిపించి.. బంగారు తెలంగాణకు బాటలు పరిచారు కేసీఆర్. అదే ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని 2019 ఫిభ్రవరి 17న నారాయణపేట, ములుగు జిల్లాలు అదనంగా ఏర్పాటు చేశారు. అలా పది జిల్లాల తెలంగాణ.. 33 జిల్లాల మాగాణంగా అవతరించింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

