సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు. విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ సూత్రాన్ని నమ్మే తన తండ్రికి సాయం చేయాలనుకున్నాడు హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన మహ్మద్ అద్నాన్. ఆ కుర్రాడి తండ్రి ఏటా రంజాన్ మాసంలో హలీం వ్యాపారం చేస్తుంటాడు. నెలరోజులూ ఆయనకు అదే ప్రపంచం. తెల్లవారుజామునే నిద్రలేస్తాడు. మళ్లీ ఏ అర్ధరాత్రి దాటాకో పడుకుంటాడు. కొన్నిసార్లు ఇంటికి కూడా రాడు. ఇంత కష్టపడినా అంతంతమాత్రం ఆదాయమే. తన తండ్రి కష్టం నలుగురికీ తెలియజేయాలనుకున్నాడు అద్నాన్. ఇన్‌స్టాలో pappakihaleem పేరున ఓ అకౌంట్ క్రియేట్ చేసి, తనే స్వయంగా హలీమ్ గురించి ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు. దీంతో అద్నాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. యూట్యూబర్లు, న్యూస్ చానళ్లవాళ్లు అద్నాన్ తండ్రి హలీమ్ బండి వద్దే తిష్ఠవేశారు. దాంతో ఆయన వ్యాపారం బాగా పుంజుకుంది. రోజూ వందలమంది ఇక్కడి హలీమ్ తింటూ అద్నాన్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. ‘ఒక కొడుకుగా నాన్న కోసం ఇంతకుమించి నేనేం చేయగలను? పప్పాకు ఇది నా రంజాన్ కానుక’ అంటాడు అద్నాన్.
♦ కడుపులో ఉబ్బరంగా అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
♦ ఇంగువ జీర్ణ సంబంధ సమస్యలకు తిరుగులేని ఔషధం. భోజనానంతరం గ్లాసు మజ్జిగలో ఇంగువ, ఉప్పు కలుపుకొని తాగితే గ్యాస్ సమస్య తగ్గడంతోపాటు ఆహారం బాగా జీర్ణం అవుతుంది. రోజూ పరగడపున ఇంగువ నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాసలో ఇబ్బంది వంటివి దరిచేరవు. దీనిలోని యాంటి ఆక్సిడెంట్ గుణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను సమర్థంగా నియంత్రిస్తాయని అధ్యయనాల్లో తేలింది.
విభిన్నంగా ఉన్నవి ఏవైనా అందరి చూపులనూ ఆకర్షిస్తాయి. అందుకే రకరకాల థీమ్‌లతో జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు స్టార్ హోటళ్ల నిర్వాహకులు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న మెర్క్యూర్ హోటల్స్ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. ఆటోమొబైల్స్ థీమ్‌తో.. శిలాయుగంనాటి రాతిచక్రం మొదలు నేటి మెర్సిడెస్ బెంజ్ చక్రం వరకు ఆటోమొబైల్ రంగంలోని పరిణామాలను రెస్టారెంట్ గోడలపై ఆయిల్ పెయింటింగ్స్ ద్వారా కండ్లకు కడుతున్నది. ఆస్ట్రేలియాలో తయారైన మొదటి పడవ నుంచి నేటి అత్యాధునిక షిప్ వరకూ హోటల్ గోడలపై చూడవచ్చు. ‘మా కస్టమర్ల నోటికే కాదు.. మెదడుకు కూడా విందు ఇవ్వాలన్నదే మా ఉద్దేశం’ అంటారు నిర్వాహకులు. ఈ థీమ్ బేస్డ్ హోటల్లో భోజనానికి ఒకరికి రూ.1,100 చొప్పున ఖర్చు అవుతుంది.
అవకాడోలో అపారమైన పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అమెరికా హార్ట్ అసోసియేషన్ వాళ్లు చేసిన తాజా అధ్యయనంలో మరోసారి ఈ విషయం బయటపడింది. వారానికి రెండు కప్పుల అవకాడో ముక్కల్ని తిన్నవారికి మిగతావారితో పోలిస్తే గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం 16 శాతం తక్కువని తేలింది. అడపాదడపా కాకుండా క్రమం తప్పకుండా తీసుకుంటేనే ఫలితాలు బాగా కనిపిస్తాయి. అవకాడోలో విటమిన్- ఎ, సి, ఇ, బి6 పుష్కలం. శరీర ద్రవాల సమతౌల్యంలోనూ అవకాడో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా. మెదడు, కళ్లు, గుండె, రక్తనాళాల సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్‌ను గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డీఎన్ఏను కాపాడటమే కాకుండా పలు రకాల క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. వీటిలోని డైటరీ ఫైబర్స్ జీవక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో ఎక్కువగా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తీసుకుంటారు. అధిక బరువు సమస్యా ఉండదు.
ఏం కావాలి?
నూడుల్స్: రెండు ప్యాకెట్లు (చిన్నవి), ఉల్లిగడ్డ: ఒకటి, ఆలుగడ్డలు: రెండు, పచ్చిమిర్చి: మూడు, క్యారెట్ తురుము: పావుకప్పు, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, నూడుల్స్ మసాలా: ఒక ప్యాకెట్ (నూడుల్స్‌తోపాటు వస్తుంది), కారం: అర టీస్పూన్, మిరియాలపొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
ఎలా వండాలి?
ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి చిన్నగా ముక్కలు చేసిన ఒక ప్యాకెట్ నూడుల్స్ వేసి సన్నటి మంటపై దోరగా వేయించాలి. వేగిన నూడుల్స్‌లో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కారం, ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్ మసాలా వేసి మరో రెండు నిమిషాలు వేగాక ఆలూ ముద్ద వేసి బాగా కలిపి దింపేయాలి. మైదాలో కొద్దిగా నీళ్లుపోసి జారుగా కలిపి పెట్టుకోవాలి. నూడుల్స్‌ను చిన్నచిన్నగా ముక్కలు చేయాలి. ఆలూ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని కట్లెట్లలా ఒత్తుకుని.. మైదా మిశ్రమంలో ముంచి నూడుల్స్‌లో దొర్లించాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోయాలి. బాగా వేడయ్యాక కట్లెట్లను వేసి ఓ మోస్తరు మంటపై గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకుంటే వేడివేడి నూడుల్స్ కట్లెట్ సిద్ధం.
నిద్రించే విధానం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? ఏ భంగిమలో పడుకుంటే ఉత్తమం?”
“మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో తుడుచుకోవడం బెటరా? కడుక్కోవడం బెటరా?”
“భోజనం చేసిన తర్వాత మగతగా ఉంటోందా? అయితే, దీన్ని తీసుకోవాల్సిందే!!”
Summer heatwave: ఎండ వేడిమిని తట్టుకోవాలంటే మలైకా అరోరాను ఫాలో అయిపోండి!!”