దుస్తులు, ఉపకరణాలు, స్టయిలింగ్‌ను ప్రచారం చేసేదే ఫ్యాషన్ ఫొటోగ్రఫీ. కార్పొరేట్ ప్రకటనలు, ఫ్యాషన్ మ్యాగజైన్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ప్రచురితమయ్యే చిత్రాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. కేవలం చిత్రాలుగానే కాకుండా.. ఒక కళాత్మక వ్యక్తీకరణ, కథన రూపకల్పనతోపాటు వాణిజ్య లక్ష్యాలతోనూ మిళితమై ఉంటుంది.
కెమెరా: కెనాన్ ఈవోఎస్5డీ మార్క్IV / ఆర్6 / ఆర్5 / నికాన్ డీ850 / సోనీ ఏ7 IV / Canon R5 లాంటి ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరాలు బాగుంటాయి. ఇవి ఫొటోలకు మంచి డెప్త్, క్లారిటీని అందిస్తాయి. ఎడిటింగ్‌లో క్రాప్ చేసినా.. పిక్సెల్స్ దెబ్బతినకుండా ఉంటుంది.
లెన్స్ : పోర్ట్రెయిట్ కోసం 50ఎంఎం f/1.8 ప్రైమ్ లెన్స్, క్లోజ్ అప్, బ్యూటీ షాట్స్ కోసం 85ఎంఎం f/1.4 లెన్స్, స్టూడియోలో షూట్ కోసం 24-70ఎంఎం f/2.8, ఔట్‌డోర్ షూట్స్, లాంగ్ పోర్ట్రెయిట్ షాట్స్ తీయడానికి 70-200ఎంఎం f/2.8 లెన్స్ ఎంపిక చేసుకోండి.
లైటింగ్ పరికరాలు : ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో లైటింగ్ సాఫ్ట్‌గా ఉండాలి. ఇందుకోసం సాఫ్ట్ బాక్స్‌లు, అంబ్రెల్లా అవసరం. మోడల్స్‌పై నీడలను తగ్గించడానికి రిఫ్లెక్టర్లు కావాలి. మోడల్స్ కండ్లను క్యాప్చర్ చేయడంలో రింగ్లైట్ బాగా ఉపయోగపడుతుంది. స్టూడియోలో లైటింగ్‌ను కంట్రోల్ చేయడానికి ఫ్లాష్/ ట్రిగ్గర్స్, బ్యాక్‌డ్రాప్ స్టాండ్స్, ట్రైపాడ్, లైట్ మీటర్, ఫ్యాషన్ ఉపకరణాలను బట్టి ఇతర యాక్ససరీస్ ఎంపిక చేసుకోండి.

మోడల్‌తో కమ్యూనికేట్ చేయండి. వారి భావోద్వేగాలు సహజంగా ఉండేలా చూసుకోండి. మీకు కావాల్సిన పోజులను ముందే ప్రాక్టీస్ చేయించండి. ఫ్రేమ్‌ను బ్యాలెన్స్ చేయడానికి రూల్ ఆఫ్ థర్డ్స్, నెగెటివ్ స్పేస్, లీడింగ్ లైన్స్లాంటి కంపోజిషన్ సూత్రాలను పాటించండి. దుస్తుల టెక్చర్, ఫ్యాబ్రిక్ కదలికలు, ఫ్యాషన్ ఉపకరణాలు, మోడల్ ఎక్స్ప్రెషన్స్.. అన్నిటినీ స్పష్టంగా క్యాప్చర్ చేయండి.
1. ఫొటోషూట్‌కు ముందు.. ఫ్యాషన్ కాన్సెప్ట్‌ను ఫైనలైజ్ చేయండి. గ్లామర్, ఎడిటోరియల్, స్ట్రీట్, వింటేజ్.. ఇలా మీ థీమ్ ఏమిటో ముందే నిర్ణయించుకోవాలి.
2. బ్యాక్‌గ్రౌండ్-లైటింగ్ టోన్‌ను మ్యాచ్ చేయండి. పూర్తి ఫోకస్ సబ్జెక్ట్మీదే ఉండాలి.
3. RAW లో షూట్ చేయండి. స్కిన్‌టోన్, కలర్స్ లాంటివి పోస్ట్ ప్రొడక్షన్లో కరెక్షన్ చేసుకోవచ్చు.
చివరిగా.. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ అనేది కళాత్మక దృష్టి, సాంకేతిక నైపుణ్యాల కలయిక. మీ చేతిలోని డీఎస్ఎల్ఆర్.. మీకు ప్రతీ అంశంపై పూర్తి నియంత్రణ అందిస్తుంది. కానీ, ఫొటోలకు ప్రాణం పోసేది మీ దృష్టి, మీ క్రియేటివిటీ మాత్రమే. మోడల్‌తో ఎంత అవగాహనతో ఉంటే.. ఫొటోలు అంత అద్భుతంగా వస్తాయని మరచిపోవద్దు.