ఏం కావాలి?
గుడ్లు: పది, మైదా, కార్న్‌ఫ్లోర్: పావుకప్పు చొప్పున, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: అర టీస్పూన్, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, చిల్లీఫ్లేక్స్: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
ఎలా చేయాలి?
ఒక గిన్నెలో ఎనిమిది గుడ్లు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక వెడల్పాటి గిన్నెకు నూనె రాసి గుడ్ల మిశ్రమం వేసి ఆవిరిపై పావు గంటపాటు ఉడికించాలి. ఉడికిన మిశ్రమాన్ని పొడవాటి ముక్కల్లా కోయాలి. ఒక గిన్నెలో రెండు గుడ్లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి చిటికెడు ఉప్పు కలపాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముక్కనూ తీసుకుని మొదట గుడ్ల మిశ్రమంలో దొర్లించి, తర్వాత పిండిలో దొర్లించి మళ్లీ గుడ్ల మిశ్రమంలో దొర్లించి చివరగా బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించి పక్కన పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి బాగా వేడయ్యాక.. అప్పటికే చేసిపెట్టుకున్న వాటిని దోరగా వేయించుకుంటే నోరూరించే ఎగ్ ఫింగర్స్ సిద్ధం.