డీఎస్ఎల్ఆర్ను పట్టేద్దాం!
కాలాన్ని బంధించే కళ.. ఫొటోగ్రఫీ! మధురమైన క్షణాలు, అపురూపమైన ఘట్టాలను ఫొటోలుగా మార్చి.. కలకాలం నిలుపుతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్లుగా మారిపోతున్నారు.
కాలాన్ని బంధించే కళ.. ఫొటోగ్రఫీ! మధురమైన క్షణాలు, అపురూపమైన ఘట్టాలను ఫొటోలుగా మార్చి.. కలకాలం నిలుపుతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్లుగా మారిపోతున్నారు. అయితే, ఫొటోలు మరింత ప్రొఫెషనల్‌గా రావాలంటే.. డీఎస్ఎల్ఆర్ కెమెరా చేత పట్టాల్సిందే!
ఫొటో గ్రఫీలో డీఎస్ఎల్ఆర్ కెమెరాలు అత్యంత ప్రాచుర్యం పొందినవి. మరి.. ఈ డీఎస్ఎల్ఆర్ కెమెరా అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? స్మార్ట్‌ఫోన్ కెమెరాతో పోలిస్తే.. డీఎస్ఎల్ఆర్ కెమరా అందించే అదనపు ప్రయోజనాలు ఏవి? దానిలోని లోపాలు, అలాగే సరైన కెమెరా ఎలా ఎంచుకోవాలి? అనే సమాచారం ఈవారం తెలుసుకుందాం!
డీఎస్ఎల్ఆర్ అంటే ‘డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్’ కెమెరా. ఇది రీల్ కెమెరాలా కాకుండా.. ‘డిజిటల్’గా పనిచేస్తుంది. వీటికి ముందుతరం ‘టీఎల్ఆర్ (ట్విన్ లెన్స్ రిఫ్లెక్ట్)’ కెమెరాల్లో.. రెండు లెన్స్‌లు ఉండేవి. ఒకటి వ్యూఫైండర్ కోసం, మరొకటి చిత్రాన్ని తీయడానికి (టేకింగ్ లెన్స్) పనికొచ్చేది. ప్రస్తుత ‘డీఎస్ఎల్ఆర్’ కెమెరాల్లో ఒకే లెన్స్ ఉంటుంది. మార్చుకునే వెసులుబాటు ఉండే ఈ లెన్స్.. వ్యూఫైండర్తోపాటు ఫొటో తీసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఇక ‘రిఫ్లెక్ట్’ అంటే.. కెమెరాలోని మిర్రర్ వ్యవస్థ ద్వారా లైట్ ప్రతిఫలించడం. ప్రస్తుతం మరింత ఆధునిక కెమెరాల్లో ఈ మిర్రర్ వ్యవస్థ కూడా ఉండదు. వాటిని ‘మిర్రర్ లెస్’ కెమెరాలుగా పిలుస్తారు. వాటిని కూడా ‘డీఎస్ఎల్ఆర్ కెమెరాలు’గానే వాడుతారు.
‘డీఎస్ఎల్ఆర్’ ఎలా పనిచేస్తుంది?
- లెన్స్ ద్వారా ‘లైట్ (సబ్జెక్ట్ ప్రతిబింబం)’ కెమెరా లోపలికి వస్తుంది.
- అది కెమెరాలోని మిర్రర్‌పై పడుతుంది.
- ఆ మిర్రర్.. లైట్‌ను ప్రిజమ్ (pentaprism)కు పంపుతుంది.
- ప్రిజమ్ నుంచి వ్యూఫైండర్ (View finder) ద్వారా.. ఆ లైట్ (సబ్జెక్ట్) మన కంటికి కనిపిస్తుంది.
- ఫొటో తీయగానే.. మిర్రర్ పైకి లేచి సెన్సర్ (Image Sensor)పై లైట్ పడుతుంది.
- సెన్సర్ ఆ దృశ్యాన్ని డిజిటల్ ఫైల్‌గా మార్చి.. మెమొరీ కార్డ్‌లో సేవ్ చేస్తుంది.
‘డీఎస్ఎల్ఆర్’లో ముఖ్యమైన భాగాలు
- లెన్స్ (Lens): ఫొటోగ్రఫీలో అనేక రకాలు ఉంటాయి. వైల్డ్‌లైఫ్, మ్యాక్రో, ట్రావెల్.. ఇలా! సందర్భాన్ని బట్టి, ఒక్కోరకమైన ఫొటోగ్రఫీకి ఒక్కోరకమైన లెన్స్ వాడుతారు.
- ప్రైమ్ లెన్స్ : వీటిలో ఫోకల్ లెంగ్త్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అంటే.. సబ్జెక్ట్పైకి జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకునే అవకాశం ఉండదు. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
- జూమ్ లెన్స్: వీటి ఫోకల్ లెంగ్త్‌ను మార్చుకోవచ్చు. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కోసం వాడుతుంటారు.
- వైడ్ యాంగిల్ లెన్స్: తక్కువ దూరం నుంచే విశాలమైన దృశ్యాలను ఫొటో తీయడానికి వైడ్ యాంగిల్ లెన్స్ ఉపయోగపడుతుంది. ల్యాండ్ స్కేప్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ ఫొటోగ్రఫీలో దీనిని వాడుతారు.
- మ్యాక్రో లెన్స్: అతి సూక్ష్మమైన వాటిని ఫొటోతీయడానికి మైక్రో లెన్స్ పనికొస్తుంది.
2. ఇమేజ్ సెన్సర్ (Image Sensor)
- సెన్సర్ సైజు.. ఫొటో క్వాలిటీని నిర్ణయిస్తుంది.
- ప్రస్తుత తరం డీఎస్ఎల్ఆర్ కెమెరాల్లో రెండు ప్రధాన సెన్సర్ రకాలు ఉన్నాయి.
- ఫుల్ ఫ్రేమ్
- ఏపీఎస్-సీ
- వ్యూఫైండర్: మీరు ఏ దృశ్యాన్ని ఫొటో తీస్తున్నారో.. దానిని రియల్ టైమ్‌లో చూపిస్తుంది.
- షట్టర్ మెకానిజం: ఫొటో తీసేటప్పుడు ఎంత సమయంపాటు లైట్ (సబ్జెక్ట్ ప్రతిబింబం) సెన్సర్‌పై పడాలో నిర్ణయిస్తుంది.
- మోడ్స్-కంట్రోల్స్: డీఎస్ఎల్ఆర్ కెమెరాల్లో వివిధ రకాల మోడ్స్ అందుబాటులో ఉంటాయి. ఫొటోగ్రఫీ రకాన్నిబట్టి వాటిని ఎంచుకోవాలి.
- ఆటో మోడ్
- మాన్యువల్ మోడ్ (M)
- అపర్చర్ ప్రయారిటీ మోడ్ (A / Av)
- షట్టర్ ప్రయారిటీ మోడ్ (S / Tv)
- ప్రోగ్రామ్ మోడ్ (P)
డీఎస్ఎల్ఆర్ ప్రయోజనాలు: స్మార్ట్‌ఫోన్ కెమెరాతో పోలిస్తే.. ‘డీఎస్ఎల్ఆర్’ అనేక ప్రయోజనాలు అందిస్తుంది.
- అత్యున్నత నాణ్యత గల ఫొటోలు
- తక్కువ లైటులోనూ స్పష్టమైన చిత్రాలు
- లెన్స్ మార్చుకునే సౌకర్యం
- వేగవంతమైన ఫోకస్
- మాన్యువల్ సెట్టింగులపై పూర్తి కంట్రోల్
డీఎస్ఎల్ఆర్ లోపాలు
- కెమెరా బరువు ఎక్కువ
- అధిక ధర ఉంటుంది
- కొత్తవారికి మాన్యువల్ సెట్టింగులు కష్టంగా ఉంటాయి.
- మెయింటెనెన్స్ అవసరం
సరైన కెమెరా ఎంచుకోవడం ఎలా?
- మీ బడ్జెట్‌ను ముందే నిర్ణయించుకోండి.
- మీ అవసరాన్ని బట్టి ఫుల్‌ఫ్రేమ్, ఏపీఎస్-సీ కెమెరాని ఎంచుకోండి.
- నికాన్, కెనాన్, సోని వంటి బ్రాండ్లను పోల్చి చూడండి.
- లెన్స్‌ల లభ్యత (availability)ని కూడా పరిగణనలోకి తీసుకోండి.
- మీకు అవసరమైన ఫొటోగ్రఫీ (వెడ్డింగ్, ట్రావెల్, వైల్డ్‌లైఫ్..) రకాన్ని బట్టి సరైన మాడల్‌ను ఎంచుకోండి.
- ప్రసిద్ధ కెమెరా బ్రాండ్లు : కెనాన్, నికాన్, సోని, పెంటాక్స్, పానాసోనిక్.. మొదలైనవి.
డీఎస్ఎల్ఆర్ వాడే రంగాలు: వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ట్రావెల్-బ్లాగింగ్ ఫొటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, యూట్యూబ్ మొదలైన రంగాల్లో డీఎస్ఎల్ఆర్ కెమెరాలను ఎక్కువగా వాడుతుంటారు. ఫైనల్‌గా.. డీఎస్ఎల్ఆర్ కెమెరా కేవలం ఫొటోలు తీసే పరికరం మాత్రమే కాదు. ఇది ఒక సృజనాత్మక సాధనం. దానిని వాడటం పూర్తిగా నేర్చుకుంటే.. ప్రతి క్షణాన్నీ ప్రొఫెషనల్ లెవెల్లో దృశ్యరూపంగా మలచవచ్చు. ఫొటోగ్రఫీలో మీకంటూ కొన్ని ప్రత్యేకమైన మైలురాళ్లను చేరుకోవచ్చు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

