ఇలాంటి వింత వింత రకాల సీతాకోక చిలుకలను ఎప్పుడైనా చూశారా!!
Butterfly | ఆకుపచ్చని ప్రకృతికి పూలు అందమైతే, వాటికి మరింత సౌందర్యాన్ని తీసుకొచ్చేవి.. సీతాకోక చిలుకలు. నేల మీదికొచ్చిన హరివిల్లు తునకల్లా చుట్టూ తిరుగాడే ఈ జీవుల్లో మనకు తెలియని వింతవింత రకాలు అనేకం ఉన్నాయి. వాటికి సంబంధించిన చిత్రవిచిత్ర మైన సంగతులెన్నో!

వెలుతురు రెక్కలు
గ్రీన్ పీకాక్ లేదా స్వాలో టెయిల్ బటర్‌ఫ్లైగా పిలిచే దీని రెక్కలు ఫ్లోరోసెంట్ రంగులను కలిగి ఉంటాయి. ఈ రెక్కల మీద అతినీల లోహిత కిరణాలు పడినప్పుడు వాటిని అవి శోషించుకొంటాయి. దీంతో చీకట్లో వెలుగులు విరజిమ్ముతాయి.

అద్దాల భామ
అచ్చం గాజులా పారదర్శకమైన రెక్కలు కలిగిన ఈ సీతాకోకచిలుకలను గ్రెటా ఒటో బటర్‌ఫ్లై లేదా గ్లాస్ వింగ్ బటర్‌ఫ్లై అంటారు. పరిసరాల్లో కలిసిపోయేందుకు ఈ రెక్కలు వీటికి ఉపయోగపడతాయి.

సర్ప ముద్రలతో
పాము తలను పోలిన ముద్రలు రెక్కల మీద ఉన్న ఈ సీతాకోక చిలుకను స్నేక్ హెడ్ బటర్‌ఫ్లై అని పిలుస్తారు. దీనిమీద ఉన్న పాము ముద్రలను చూసి పక్షులు వీటి జోలికి రావట. ఒకవేళ ఏదైనా అపాయం అనిపిస్తే నేల మీద పడిపోయి పాము కదలికలను పోలి ఉండేలా రెక్కలను నెమ్మదిగా కదుపుతాయట. వీటి జీవితకాలం పది రోజులు మాత్రమే. కేవలం ప్రత్యుత్పత్తి కోసమే ఇవి పుడతాయి.

ఎండుటాకులా
ఎండిపోయిన ఆకులా కనిపిస్తున్న ఈ సీతాకోకచిలుకను ఇండియన్ ఓక్లీఫ్ లేదా డెడ్‌లీఫ్ బటర్‌ఫ్లై అని పిలుస్తారు. నేరుగా చూసినా గుర్తుపట్టలేనంత చిత్రంగా ఉంటుంది.

బ్లాక్ అండ్ వైట్ జీబ్రాలా
నలుపూ తెలుపూ చారలు ఉండటమే కాదు.. జీబ్రా లాంగ్ వింగ్ జాతి సీతాకోకచిలుకలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అన్నీ పువ్వుల మకరందాన్ని గ్రోలితే, ఇది మాత్రం పుప్పొడిని ఆహారంగా తీసుకుంటుంది. దీంతో ఎక్కువ గుడ్లు పెట్టగలుగుతుంది.

డిజైనర్ బ్యూటీ
రెక్కల మీద 88 అంకెతో ఉన్న ఈ రంగుల కీటకాన్ని చూడగానే ఎవరో ఫొటోషాప్ ట్రిక్ చేశారేమో అనిపిస్తుంది. కానీ ఈ సీతాకోక చిలుక నిజంగా ఇలాగే ఉంటుంది. దీన్ని డయా ఎత్రియా అన్నా లేదా అన్నాస్ 88 బటర్‌ఫ్లైగా పిలుస్తారు.
Read More :
Thunder Mushroom | ఈ పుట్టగొడుగులు ఎందుకంత స్పెషల్.. ఇవి అన్నిచోట్ల ఎందుకు దొరకవు?”
ఈ ప్రపంచం మీద అసలు ఇలాంటి ఆటలు ఉన్నాయని తెలుసా
Non Alcoholic Drinks | ఈ బీరు, విస్కీల్లో ఆల్కహాల్ అస్సలు ఉండదట!
షుగర్ పేషెంట్ల కోసమే ఈ చెప్పులు.. వీటి స్పెషాలిటీ ఏంటంటే..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- ‘ Butterfly ’
- Nature
- variety
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

