Non Alcoholic Drinks | ఈ బీరు, విస్కీల్లో ఆల్కహాల్ అస్సలు ఉండదట!
Non Alcoholic Drinks | మద్యం అంటే.. మరణంతో ములాఖత్! బారు నుంచి ఇంటికి చేరుకునేలోపు ఏ యాక్సిడెంట్కో గురికావచ్చు. తక్కువలో తక్కువ కాలో చెయ్యో విరిగిపోవచ్చు. లేదంటే, ఇంటికి చేరాక ఇల్లాలి బడితపూజ ఉండనే ఉంటుంది. కొన్నాళ్లకు ఏ కాలేయ సమస్యో బయటపడొచ్చు. ప్రాణాంతకమూ కావచ్చు. ఇన్ని సమస్యలు అవసరమా? మద్యం మానేస్తే పోలా? చాలామంది ఆ పనే చేస్తున్నారు.
..కాలక్షేపానికి నాన్ ఆల్కహాలిక్ బీరు, విస్కీ, రమ్ము, జిన్ను ఎంచుకుంటున్నారు. రుచిలో ఏమాత్రం రాజీపడకుండా.. అసలు ఆల్కహాల్ శాతమే లేకుండా.. ఆరోగ్యవంతమైన పానీయాలను సిద్ధం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.

నాటీ స్పార్క్లింగ్ చార్డొనే
స్పెయిన్‌కు చెందిన ఈ నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ భారత్‌లోనూ అందుబాటులో ఉంది. ద్రాక్షతో పాటు వివిధ మొక్కలతో దీన్ని తయారు చేస్తారు. వంద ఎంఎల్ పానీయంలో కేవలం 2.9 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక గ్లాసు తాగితే 14 కేలరీల శక్తి వస్తుంది. బాటిల్ ధర రూ. 21,750.

బ్రాండ్ స్వామి
క్రాఫ్ట్ టానిక్ వాటర్‌లో భారత్‌లోనే అగ్రగామిగా ఉన్నది ముంబైకి చెందిన స్వామి కంపెనీ. వీరు ఆల్కహాల్ లేని మూడు కాక్టెయిల్లను అందిస్తూ బోలెడు లాభాలు ఆర్జిస్తున్నారు. వాటిలో జీఅండ్టీ, పింక్ జిన్ అండ్ టానిక్, రమ్ అండ్ కోలా ప్రముఖమైనవి. గతేడాది వీటిని ప్రవేశపెట్టగా ఆ కంపెనీ ఆదాయం ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగిందట. వీటిని వెనిలా, పంచదార పాకం, దాల్చిన చెక్కతో తయారుచేశారు. ఈ పానీయం 56 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది.

కటీ పతంగ్
ఢిల్లీకి చెందిన క్రాఫ్ట్ బీర్ బ్రాండ్.. కటీ పతంగ్. గతేడాది ‘నాట్’ పేరుతో నాన్ ఆల్కహాలిక్ పానీయాల శ్రేణిని విడుదల చేసింది. వీటిల్లో కటీ పతంగ్ నాట్ జిన్ అండ్ టానిక్, నాట్ కాస్మోపాలిటన్, నాట్ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్రాండ్లు ఉన్నాయి. మూడు విభిన్న రుచులలో ఈ పానీయాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మైనస్ కేలరీలు ఉంటాయి. నాట్ ఓల్డ్ ఫ్యాషన్డ్ పానీయాన్ని 35కు పైగా మసాలా దినుసులతో తయారు చేశారు. జూన్‌లో వీటి ఉత్పత్తి ప్రారంభమైంది. నెలలోనే స్టాక్ అయిపోయింది. అంతటి డిమాండ్ మరి!

సోబర్ జిన్
కేవలం గోవాలోనే లభించే సోబర్ జిన్ ఇటీవలే మార్కెట్లో ప్రవేశించింది. ఈ జిన్‌లో ఆల్కహాల్ అస్సలు ఉండదు. ఐదు కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిని బెర్రీపండ్లు, అశ్వగంధ, తులసితో తయారుచేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందీ పానీయం. కాబట్టే రూ.1,499 పెట్టి కొనడానికి కూడా ఎవరూ సందేహించడం లేదు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. భారత దేశపు మొట్టమొదటి నాన్ ఆల్కహాల్ జిన్‌గా పేరు తెచ్చుకుంది.

కూల్బర్గ్
ముంబైకి చెందిన కూల్బర్గ్ భారతదేశపు మొట్టమొదటి జీరో ఆల్కహాల్ బీర్ కంపెనీ. బార్లీని మాల్ట్ చేసి, అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగించి, మళ్లీ చల్లార్చి తయారు చేస్తారు. బార్లీమాల్ట్, అల్లం, క్రాన్బెర్రీ, పుదీనా, పీచ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో లభిస్తుంది. భారత్‌లో అత్యంత ఆదరణ పొందింది.

జినిష్
డెన్మార్క్‌కు చెందిన నాన్ ఆల్కహాలిక్ జిన్.. ‘జినిష్’. దీనిని బెర్రీపండ్లు, ధనియాలు, మిరప గింజలు వంటి సహజసిద్ధ పదార్థాలతో చేశారు. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. డెన్మార్క్ GinISH ధర రూ.1,750.

కోస్ట్
బెల్జియం తయారీ నాన్ ఆల్కహాలిక్ బీర్ ఇది. దీన్ని వివిధ రకాల పండ్ల నుంచి తయారు చేశారు. ఇందులో 33 కేలరీలు ఉంటాయి. బాటిల్ ధర రూ.250.
Read More :
“మందు తాగడం మానేయాలని అనుకునేవారికి గుడ్‌న్యూస్ !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Alcohol
- drinks
- non alcohol
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

