Drinking Behavior | టీనేజ్లో అడుగుపెట్టే పిల్లలకు మద్యం ఓ సరదా కావచ్చు. అదో సాహసంలా తోచవచ్చు. కానీ జీవితం పట్ల, ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేని ఆ వయసులో… మద్యపాన వ్యసనం అదుపు తప్పే ప్రమాదం ఉంది. మెదడు ఎదుగుతున్న దశలో శ్రుతిమించిన మందు అలవాటు వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని, వైద్యులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.
మన భావోద్వేగాలకు, జ్ఞాపకశక్తికి కేంద్రమైన అమిగ్డలా దెబ్బతింటుందని చెబుతున్నారు. ఫలితంగా ఆందోళన పెరుగుతుంది. మద్యపాన బానిసత్వం మరింత అధికం అవుతుంది. ఇప్పటివరకూ ఈ సమస్యకు పరిష్కారం లేదనుకునేవారు. కానీ షికాగో శాస్త్రవేత్తలు ఓ మార్గాన్ని కనుగొన్నారు. అమిగ్డలా పనితీరులో కీలకపాత్ర పోషించే ‘ఆర్క్’ అనే జన్యువును కనుక సరిదిద్దగలిగితే, సానుకూల ఫలితం వస్తుందని గ్రహించారు. ఇందుకోసం ఆ జన్యువును మునుపటి దశకు తెచ్చేలా రీసెట్ చేస్తారు.
“మీ పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!!”
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?”
Water Drinking : తాగే నీళ్లకు, గుండె ఆరోగ్యానికి సంబంధం ఉందా.. అధ్యయనం ఏం చెబుతోంది?”
స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలా..? రోజూ పచ్చదనంలో గడపండి..!”