రైల్లో పడుకున్న ప్యాసింజర్.. తెల్లారినా కదలని రైలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
లాంగ్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్నాడా వ్యక్తి. టైంకి రైల్వే స్టేషన్ వచ్చేసి రైలు ఎక్కేశాడు. తన స్లీపర్ సీటుకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. తెల్లారి నిద్రలేచి చూస్తే రైలు కదల్లేదని అతనికి అర్థమైంది. దీంతో షాకైపోయాడు. ఈ ఘటన స్కాంట్లలాండ్లో వెలుగు చూసింది.
గ్లాస్గోలో రైలు ఎక్కిన జిమ్ మెట్కాఫ్ అనే వ్యక్తి తెల్లారేసరికి లండన్ వెళ్లిపోతానని అనుకున్నాడు. అయితే యూరప్ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ఆ రైలు రద్దయింది. ఈ విషయం జిమ్‌కు తెలియదు. అందుకే రైలు ఎక్కి పడుకున్నాడు. జిమ్ రెగ్యులర్‌గా అదే రైలులో ప్రయాణిస్తాడని, దీంతో రైలు రద్దయిన సంగతి తెలియక ట్రైన్లో రాత్రంతా పడుకున్నాడని సమాచారం.
‘‘సుమారు 15 ఏళ్లుగా ఈ రైల్లో ప్రయాణిస్తున్నా. చాలా ట్విస్టులు చూశాను కానీ.. ఇదే వాటన్నింట్లోకి వింతగా అనిపించింది. రాత్రంతా నిద్రపోయి లేస్తే.. ఆ రైలు అసలు కదల్లేదు. ఈరోజు తెల్లారగానే 5.30 గంటలకు వేరే సిటీలో మమ్మల్ని దింపేశారు’’ అని జిమ్ తన చేదు అనుభవాన్ని వివరించాడు.
@CalSleeper In 15 years of using this train, and through many bizarre twists and turns, this has to be strangest yet. Wake up, and the train never left Glasgow. It was just sat here all night, and now we have been thrown off it at 5.30am in the wrong city. pic.twitter.com/MZyRwm9C7E
— Jim Metcalfe (@jim_metcalfe) July 20, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

