Empty Stomach : ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నారంటే అంతే.. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టే..!
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారంటే | రోజంతా ఏం చేసినా నడుస్తుంది.. ఏం తిన్నా పర్వాలేదు కానీ.. ఉదయం లేవగానే కొందరు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల
రోజంతా ఏం చేసినా నడుస్తుంది.. ఏం తిన్నా పర్వాలేదు కానీ.. ఉదయం లేవగానే కొందరు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల.. వాళ్ల జీవితమే అంధకారం అవుతుంది. కోరి రోగాలను తెచ్చుకున్నవాళ్లు అవుతారు. ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవాళ్లు అవుతారు.

ఉదయం లేవగానే కడుపు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే.. రాత్రి పడుకునే ముందు ఆహారం తీసుకున్నా.. ఉదయం లేచేవరకు కడుపులో ఉన్న ఆహారం అరిగిపోతుంది. అంటే కనీసం 8 గంటల నుంచి కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి సమయంలో శరీరం లోపల చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. అనారోగ్యానికి గురయినట్టే.
ఉదయం లేవగానే.. ఖాళీ కడుపుతో.. లేదా పరిగడుపున ఏం తినకూడదో చాలామందికి తెలియదు. ఏది పడితే అది తినేస్తుంటారు. తాగేస్తుంటారు. అసలు.. ఉదయం లేవగానే ఏం తినకూడదు.. ఏం తాగకూడదు.. అనే విషయాలను సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ పూజా మఖిజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అవేంటో తెలుసుకుందాం రండి.
కాఫీ – Caffeine

అతి ముఖ్యమైనది కాఫీ. ఎందుకంటే.. ఉదయం లేవగానే చాలామంది చేసే పని ఇదే. లేవగానే.. కాఫీ.. అని అరుస్తుంటారు. దీంతో ఇంట్లో ఉన్నవాళ్లు.. వాళ్లకు బెడ్ మీదే కాఫీ అందిస్తారు. అది తాగితే కానీ.. వాళ్ల పనులు మొదలవ్వవు. దానికే బెడ్ కాఫీ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా? అసిడిటీ సమస్యలు వస్తాయి. అసిడిటీ వల్ల.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావం ప్రేరేపితం అయి చాలా సమస్యలు వస్తాయి. తిన్నది అరగకపోవడం, చాతిలో నొప్పి రావడంతో పాటు ఇంకా చాలా సమస్యలు వస్తాయి. అందుకే.. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఎంత త్వరగా మానేస్తే అంత బెటర్.
ఆల్కాహాల్ – Alcohol

చాలామందికి ఇష్టమైన డ్రింక్ ఇది. కానీ.. దీన్ని ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మద్యాన్ని తీసుకుంటే ఆల్కాహాల్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దాని ద్వారా శరీరంలో మొత్తానికి ఆల్కాహాల్ వ్యాపిస్తుంది. దాని వల్ల రక్తంలోని రక్తనాళాలు ఎఫెక్ట్ అయి పల్స్ రేట్, బీపీ ఒక్కసారిగా పడిపోతుంది. అలాగే.. ఆల్కాహాల్.. రక్తం ద్వారా కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్.. అటునుంచి మెదడుకు కూడా చేరుతుంది. ఇది దీర్ఘకాలంలో చాలా సమస్యలను తీసుకొస్తుంది. ఒకవేళ ఏదైనా ఆహారం తీసుకొని ఆల్కాహాల్ తీసుకుంటే.. రక్తంలో పూర్తిస్థాయిలో ఆల్కాహాల్ కలవకుండా.. నివారించవచ్చు. దాని వల్ల.. తక్కువ సమస్యలు వస్తాయి.
చూయింగ్ గమ్ – Chewing gum

చాలామందికి చూయింగ్ గమ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే దాన్ని ఖాళీ కడుపుతో నమలకూడదు. నిజానికి గమ్‌ను నమలడం వల్ల.. జీర్ణవ్యవస్థలో ఆమ్లాలు విడుదలవుతాయి. అవి.. జీర్ణాశయంలో ఉన్న ఆహారాన్ని అరగదీస్తాయి. ఖాళీ కడుపుతో గమ్ నమిలితే.. జీర్ణాశయంలో ఎటువంటి ఆహారం ఉండదు కాబట్టి.. గమ్ నమలడం వల్ల విడుదలైన ఆమ్లాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. దాని వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా సమస్యలు వస్తాయి.
షాపింగ్ – Shopping

ఇది చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే.. ముఖ్యంగా మహిళలు.. షాపింగ్ గొడవలో పడి ఏం తినకుండా షాపింగ్‌కు వెళ్తుంటారు. ఖాళీ కడుపుతో షాపింగ్ చేస్తే.. కావాల్సిన వాటి కంటే ఎక్కువ వస్తువులను తీసుకుంటారట. అలాగే.. ఎక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్ని, జంక్ ఫుడ్‌ను తింటారని.. అందుకే ఖాళీ కడుపుతో కాదు.. ఫుల్‌గా తిని షాపింగ్‌కు వెళ్లాలని పూజ సలహా ఇస్తున్నారు.
Don’t argue

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోకూడదట. ఒకవేళ ఎవరితోనైనా వాదించాలంటే ముందు ఏదైనా తిని.. అప్పుడు వాదించుకోండి అంటున్నారు పూజ. ఆకలితో ఉన్నప్పుడు తక్కువ బీపీ ఉంటుందట. అలాగే గొడప పెట్టుకుంటూ ఉండే.. బీపీ పూర్తిగా డౌన్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. కడుపులో ఏదైనా ఉంటే.. అప్పుడు కోపం కూడా తగ్గి.. బీపీ నార్మల్ అవుతుంది.
Non-steroidal anti-inflammatory drugs
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు Non-steroidal anti-inflammatory drugs ను అస్సలు తీసుకోవద్దు. పెయిన్ కిల్లర్స్, జ్వరం తగ్గించే మెడిసిన్ లాంటివి ఈ కేటగిరీ కిందికే వస్తాయి. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు వేసుకోవద్దు. ఏదైనా తిన్నాకే ఈ మెడిసిన్‌ను వేసుకోవాలి. ఖాళీ కడుపున ఈ మెడిసిన్స్ వేసుకుంటే.. కడుపులో తిప్పినట్టుగా అవడం, వాంతులు, వికారం అయ్యే ప్రమాదం ఉంటుందట. అలాగే.. మెడిసిన్స్ పడక నోటిలో, కడుపులో పుండ్లు అవుతాయని న్యూట్రిషనిస్ట్ పూజ స్పష్టం చేశారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Saffron | మగాళ్లు రోజూ కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది.. తెలిస్తే షాకవుతారు!
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్‌లు ఇవే..
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

