కేరళ రాష్ట్రం కొచ్చి నగరంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా డిసెంబర్ 29న మలయాళ నటి ఒకరు 11,600 మంది డ్యాన్సర్లతో ఇచ్చిన ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించింది. ఆ నటి ఎవరు?
దేశంలోనే తొలిసారిగా సముద్రం మధ్య గాజు వంతెన డిసెంబర్ 30న ప్రారంభించారు. 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ గాజు వంతెన ఎక్కడ ఉంది?
ప్రొ కబడ్డీ సీజన్ 11లో ఏ జట్టు టైటిల్ గెలుచుకుంది? ఏ జట్టు మీద ఈ విజయం సాధించింది?
ప్రసిద్ధ మలయాళ రచయిత, సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత ఒకరు డిసెంబర్ 25న మరణించారు. భారతదేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠం కూడా పొందిన ఆ సాహితీవేత్త ఎవరు?
థాయ్‌లాండ్‌లోని సి రాచా జూలో ఉన్న ఓ పిల్ల హిప్పోపోటమస్ సంరక్షణ కోసం కెనడాకు చెందిన ఓ
సంపన్నుడు రూ. 2.51 కోట్లు విరాళంగా ఇచ్చాడు. మైకేల్ జాక్సన్ మూన్ డ్యాన్స్‌తో అదరగొట్టి వార్తల్లో నిలిచిన ఆ హిప్పో పేరేంటి?
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్యామ్ బెనగల్ డిసెంబర్ 23న మరణించారు. భారతదేశంలో క్షీర విప్లవం నేపథ్యం వివరిస్తూ ఆయన తెరకెక్కించిన ఓ సినిమా ప్రపంచంలోనే తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా రికార్డు సాధించింది. అది ఏది?
భారత్, బంగ్లాదేశ్ దేశాలకు వాటర్ బాంబ్‌గా పిలిచే ఓ భారీ ఆనకట్టను నిర్మించడానికి చైనా ప్రభుత్వం ఇటీవల ఆమోదముద్ర వేసింది. నిర్మాణం పూర్తయితే ఇదే భూమ్మీద అతిపెద్ద డ్యాంగా నిలుస్తుందని వార్తలు వచ్చాయి. ఏ నదిమీద నిర్మించనున్నారు?
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల తన 94వ ఏట మరణించిన ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ సుజుకి మోటర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎవరు?
డిసెంబర్ 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసేందుకు విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం పేరేంటి? ఏ రాకెట్‌ను ఉపయోగించారు?
అతి తక్కువ మ్యాచుల్లో, అతి తక్కువ పరుగులు ఇచ్చి 200 వికెట్లు తీసిన భారత క్రికెట్ జట్టు తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఎవరు రికార్డు సాధించాడు?