1. 19 ఏండ్లకే ‘మిస్ ఇండియా యూనివర్స్ 2024’ అందాల కిరీటం గెలుచుకున్న గుజరాత్‌కు చెందిన మోడల్ ఎవరు?
2 . మణిపురి వివాహ డ్రెస్ రెడ్ కుమిన్ పొట్లొయ్ ధరించి, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలతో ర్యాంప్‌పై నడిచిన తొలి భారతీయ నటిగా వార్తల్లో ఎవరు నిలిచారు?
3 .ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్న పిల్లుల్లో అత్యంత వృద్ధ మార్జాలం తన 33వ ఏట ఇటీవల మరణించింది. ఆ పెంపుడు పిల్లి పేరేంటి?
4.ఇటీవల తెలుగు నటుడు చిరంజీవి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఏ విషయంలో ఆయనకు ఈ ఘనత దక్కింది?
5 .నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య సమావేశం వేదికగా గళమెత్తిన భారతీయ సామాజిక కార్యకర్త ఎవరు?
6 .మనదేశంలో ఓ నగరం ట్రామ్ కార్లకు ప్రసిద్ధిచెందింది. అయితే, 150 ఏండ్ల చరిత్ర కలిగిన ట్రామ్ సేవలకు సెలవు ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ నగరం ఏది?
7 .మనుషులను దీర్ఘకాలం వేధించే కుష్ఠు వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో ఓ దేశం విజయం సాధించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఘనత సాధించిన తొలిదేశం ఏది?
8 .ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచుకు చేరుకున్న హిందూ మహాసముద్ర ద్వీపదేశం శ్రీలంకలో ఇటీవల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో మార్క్సిస్ట్ నాయకుడు విజయం సాధించారు. ఆయన ఎవరు?
9 .సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలతోపాటు గ్రహ శకలాలు కూడా భాగంగా ఉంటాయి. 2029లో ఓ గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుందని వార్తలు వచ్చాయి. అది ఏది?
10 .వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అర్ధ శతకం, మూడు వికెట్లు, మూడు క్యాచ్‌లు అందుకున్న అరుదైన రికార్డు సృష్టించిన తొలి క్రికెటర్ ఎవరు?
జవాబులు
1. రీయా సింఘా
2. ఊర్వశి రౌటేలా
3. రోజీ (1991లో జన్మించింది)
4. 156 చిత్రాల్లో 537 పాటలకు 24,000 డ్యాన్స్ స్టెప్లు వేసినందుకు
5. ఒడిశాకు చెందిన రంజితా ప్రియదర్శిని
6. కోల్‌కతా
7. మధ్య ఆసియా దేశం జోర్డాన్
8. అనూర కుమార దిస్సనాయకే (జనతా విముక్తి పెరమున పార్టీ నాయకుడు)
9. అపోఫిస్ (గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కూడా అంటారు)
10. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ (ఇంగ్లండ్‌తో)