11,304 మంది జానపద నర్తకులు, 2,500 మంది డోలు వాద్యకారులతో అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన ఓ సంప్రదాయ ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించింది. అది ఏ ఉత్సవానికి సంబంధించింది?
వరల్డ్స్ వెల్దియెస్ట్ సిటీస్ రిపోర్ట్- 2023 ప్రకారం 2022 డిసెంబర్ 31 నాటికి 3,40,000 మంది మిలియనీర్లతో రికార్డు సృష్టించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలం?
ఫ్యాషన్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేసి, ఒకతరం మహిళలకు మహా ఇష్టంగా మారిన ఆహార్యం.. మినీ స్కర్ట్. ఏప్రిల్ 13న తన 93వ ఏట మరణించిన ప్రముఖ బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్, మినీ స్కర్ట్ సృష్టికర్త ఎవరో చెప్పండి?
అంతరించిపోతున్న జాతికి చెందిన లక్ష కోతులను చైనా జంతు ప్రదర్శనశాలలకు ఎగుమతి చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. అవి ఏ జాతికి చెందిన వానరాలు?
ఫెమినా మిస్ ఇండియా 59వ ఎడిషన్ అందాల పోటీల్లో 2023 సంవత్సరానికి ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని దక్కించుకున్న రాజస్థాన్యువతి పేరేమిటి?
జర్మనీలో అణువిద్యుత్ కేంద్రాలను మూసేసి.. అణు విద్యుత్ ఉత్పాదనను నిలిపివేస్తున్న తరుణంలో.. అదే ఖండానికి చెందిన మరోదేశం మాత్రం ఐరోపాలోనే అత్యంత శక్తిమంతమైన అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. అది ఏ దేశం?
హస్తకళలు, వ్యవసాయ, సహజ, పారిశ్రామిక ఉత్పత్తుల పరిరక్షణకు కేటాయించే భౌగోళిక గుర్తింపు (జీఐ)ను పొందిన జమ్ముకశ్మీర్‌కు చెందిన చిత్రకళ ఏది?
తుర్కియే ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-1 టోర్నమెంట్లో సింగిల్-50 రౌండ్లో 360/360 పాయింట్లు సాధించిన తొలి మహిళా ఆర్చర్‌గా రికార్డు సృష్టించిన తెలుగు క్రీడాకారిణి?
యూకేలోని మాంచెస్టర్‌లో నిర్వహించిన ఓ మారథాన్‌లో 42.5 కిలోమీటర్ల దూరాన్ని 4.50 గంటల్లో చీరకట్టులో పూర్తిచేసి వార్తల్లో నిలిచిన ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లాకు చెందిన మహిళ?