పల్లెకు పట్టాభిషేకం
స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ పాలన.. పల్లెకు పట్టాభిషేకం చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో.. పాలనలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటివరకూ దూరంగా సాగిన పరిపాలన.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దగ్గరైంది.
స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ పాలన.. పల్లెకు పట్టాభిషేకం చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో.. పాలనలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటివరకూ దూరంగా సాగిన పరిపాలన.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దగ్గరైంది. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా మొత్తంగా 33 జిల్లాలు, 621 మండలాలు, 12,760 గ్రామపంచాయతీలతో.. పరిపాలన క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువైంది.
పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భౌగోళికంగా చూస్తే.. పాత జిల్లాల పరిధి చాలా విస్తారంగా ఉండేది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలు 10వేల చదరపు కిలోమీటర్లకుపైగా విస్తీర్ణంతో ఉండేవి. దాంతో, ఆయా జిల్లాల మారుమూల ప్రాంతాల ప్రజలు.. జిల్లా స్థాయి అధికారులను కలవడం, వివిధ ప్రభుత్వ సేవలు పొందడం కష్టమయ్యేది. జిల్లా కేంద్రాలకు రావడానికే పలు బస్సులు మారాల్సి వచ్చేది. ఫలితంగా, పల్లె ప్రజలకు దూరాభారం తప్పేది కాదు. వ్యయం తడిసి మోపెడయ్యేది. అయితే, 2016లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో.. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం జిల్లాల సంఖ్యను పెంచడం మాత్రమే కాదు.. జిల్లా- రెవెన్యూ డివిజన్-మండలం-గ్రామపంచాయతీ స్థాయిల్లో పరిపాలనా వ్యవస్థను పునర్నిర్మించింది.

Patelcheruvu Thanda
మండలాలతో మరింతగా..
ప్రభుత్వ పరిపాలనలో మండల కేంద్రం కీలకంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, సంక్షేమం, విద్య, వైద్యం తదితర శాఖలకు సంబంధించిన సేవలు మండల స్థాయిలోనే అందుతాయి. అందుకే, కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలతోపాటు మండలాల సంఖ్యను కూడా పెంచింది. 459గా ఉన్న రెవెన్యూ మండలాలను 621కి చేర్చింది. అన్ని శాఖల్లోనూ మండల స్థాయి అధికారులను అందుబాటులో ఉంచింది. దాంతో, ప్రజలు ప్రతి చిన్న అవసరానికీ దూరంలోని మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గింది. ఇక, పరిపాలనా వికేంద్రీకరణలో మరో ముఖ్యమైన మలుపు గ్రామపంచాయతీల ఏర్పాటు. 500లోపు జనాభా ఉన్న చిన్న గూడేలు, తండాలను పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీలుగా మార్చింది. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య 12,760కి చేరింది. దీనివల్ల గ్రామస్థాయిలో అవసరాలను గుర్తించడం, గ్రామాభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వడం, పారిశుధ్యం, తాగునీరు, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై స్థానిక సంస్థలు మరింత దృష్టిపెట్టే అవకాశం పెరిగింది. మొత్తంగా, అభివృద్ధి ప్రణాళికలో గ్రామం నుంచి మండలం.. మండలం నుంచి జిల్లా వరకు ఒక అనుసంధాన వ్యవస్థ ఏర్పడింది. ఫలితంగా గతంలో కేంద్ర సర్కారు ప్రకటించిన అవార్డుల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్రమే దక్కించుకున్నది. ఇది కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనం.
అందుబాటులోకి అన్ని వసతులు..
కొత్త మండలాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఉద్యోగుల కేటాయింపు, అధికార యంత్రాంగం విస్తరణ లాంటి చర్యలు చేపట్టారు. నూతన మండల కేంద్రాల్లో తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ-సంక్షేమం, తదితర అధికార వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. దాంతో ఆయా గ్రామాలకు ప్రజల రాకపోకలు పెరిగాయి. అదే సమయంలో అధికారుల నివాసాలు, ఉద్యోగుల అవసరాలు, వ్యాపార కార్యకలాపాలు, బ్యాంకింగ్, విద్య, వైద్యం, రవాణా వంటి సేవలకు డిమాండ్ పెరిగింది.

Village
రోడ్లతో అనుసంధానం
పరిపాలన వికేంద్రీకరణకు రహదారుల అనుసంధానం అత్యంత కీలకం. కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కేంద్రం-మండల కేంద్రం-గ్రామం మధ్య రహదారి వ్యవస్థ మెరుగుపడింది. రోడ్ల విస్తరణ, డబుల్ లేన్, బీటీ రోడ్లు, వంతెనలు, అంతర్గత రహదారులు వంటి పనులు చేపట్టారు. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే ప్రధాన మార్గాలను 100 అడుగుల రోడ్లుగా విస్తరించడంతో ప్రయాణ సమయం తగ్గింది. రహదారులకు రెండువైపులా హరితహారం మొక్కలతో.. పల్లెలు కూడా పట్టణ శోభను సంతరించుకున్నాయి. మొత్తంగా.. కొత్త జిల్లా కేంద్రాల ఆవిర్భావం, మండలాల విస్తరణ, రహదారుల అనుసంధానం, మౌలిక వసతుల కల్పన ద్వారా.. తెలంగాణ పల్లెలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.
గణాంకాల్లో తెలంగాణ పరిపాలనా విస్తరణ
మొత్తం జిల్లాలు: 33
గ్రామీణ జిల్లాలు: 31
మొత్తం మండలాలు: 621
గ్రామీణ మండలాలు: 565
గ్రామ పంచాయతీలు: 12,760
– లట్టుపల్లి విక్రమ్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

