వేసవిలో ఫ్యాన్లతో సమానంగా కరెంటు మీటర్లు కూడా తిరుగుతాయి. ఇక పాత కాలపు ఫ్యాన్లయితే ఎక్కువ కరెంటును వాడుకుంటాయి. ఇన్వర్టర్ మీద ఉన్నప్పుడు బ్యాటరీని ఇట్టే ఖాళీ చేస్తాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. స్టయిలిష్ లుక్, సూపర్ సేవింగ్స్‌తో Colorbot Stella BLDC Ceiling Fan వచ్చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఆధునిక BLDC మోటార్‌తో పనిచేస్తుంది. సాధారణ ఫ్యాన్లు 75-80 వాట్ల కరెంటును వాడుకుంటే, ఇది కేవలం 26 వాట్లను మాత్రమే తీసుకుంటుంది. దీంతో కరెంటు బిల్లులో 65% వరకూ ఆదా అవుతుంది. ఇది BEE 5-స్టార్ రేటింగ్ పొందిన ఫ్యాన్. 370 ఆర్పీఎం స్పీడ్‌తో గది మూలమూలకూ చల్లటి గాలిని అందిస్తుంది. రిమోట్ కంట్రోల్ సదుపాయంతో కూర్చున్న చోటు నుంచే 6 రకాల స్పీడ్లను మార్చుకోవచ్చు. ఇందులోని ‘రివర్స్ మోడ్’.. చలికాలంలో గదిలోని వేడి గాలిని కిందికి పంపి వెచ్చదనాన్ని ఇస్తుంది. దీనికి ఉన్న LED స్పీడ్ ఇండికేటర్ మీ గదికి ఒక మోడ్రన్ లుక్ ఇస్తుంది.
ధర: రూ.3,199 (ఆఫర్లను బట్టి మారుతుంది)
దొరుకు చోటు: అమెజాన్

కిచెన్‌లో చిమ్మిన నూనెను తుడవాలన్నా, ఒలికిన పాలను క్లీన్ చేయాలన్నా.. సాధారణంగా కిచెన్ టిష్యూ పేపర్లను వాడుతుంటాం. అయితే, అవి ఒక్కసారి వాడగానే పాడైపోతాయి, పైగా ఖర్చు కూడా ఎక్కువే. ఈ సమస్యకు ShineXPro Microfiber Cleaning Cloth Roll చక్కని పరిష్కారం చూపుతాయి. ఇవి పేపర్ టవల్స్ లాగే కనిపిస్తూ.. అంతకంటే 10 రెట్లు తక్కువ ఖర్చుతో పనిచేస్తాయి. ఈ రోల్లో 50 మైక్రోఫైబర్ క్లాత్స్ ఉంటాయి. అవసరమైనప్పుడు పేపర్ లాగే చింపుకొని వాడుకోవచ్చు. ఇవి పల్చని స్పాంజ్‌లా ఉండటం వల్ల నీటిని, జిడ్డును చాలా వేగంగా పీల్చుకుంటాయి. ఒక్కో క్లాత్‌ను కనీసం 200 సార్లు ఉతికి వాడుకోవచ్చు. అంటే మొత్తం రోల్‌ను 10,000 సార్లు వాడుకోవచ్చన్నమాట! ఇది ఎలాంటి పీచునూ వదలదు.. దీంతో కిటికీ అద్దాలు, మొబైల్ స్క్రీన్లు, కార్ డ్యాష్‌బోర్డులు తుడవడానికీ పనికొస్తుంది. ఒకసారి ఈ రోల్ కొంటే మీకు కొన్ని నెలల వరకు కిచెన్ టిష్యూలతో పని ఉండదు. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, జేబుకు కూడా ఆదా కలిగించే ఈ స్మార్ట్ క్లీనింగ్ సొల్యూషన్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే.
ధర: రూ.496 (50 పీసెస్),
దొరుకు చోటు: అమెజాన్

వంటల్లో, బేకింగ్‌లో పదార్థాల కొలతలు సరిగ్గా ఉంటేనే రుచి కుదురుతుంది. ముఖ్యంగా కేకులు చేసేటప్పుడు, డైట్ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు గ్రాముల లెక్కన కొలవడం చాలా ముఖ్యం. చేతితో అంచనా వేయడం వల్ల ఒక్కోసారి వంటలు పాడవుతుంటాయి. అలా కావొద్దంటే.. కచ్చితమైన కొలతలను చూపించే Curaze Digital Food Weight Machine ఇంట్లో ఉండాల్సిందే! ఇది 10 కేజీల వరకు బరువును తూచగలదు. 1 గ్రాము కచ్చితత్వంతో బరువును చూపిస్తుంది. చూడటానికి చాలా స్లిమ్, స్టయిలిష్‌గా ఉంటుంది. దీనిని వాడటం, క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. కాంపాక్ట్ డిజైన్ వల్ల కిచెన్ కౌంటర్‌పై చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇంటి అవసరాల కోసం ఇదో నమ్మదగిన కిచెన్ డివైజ్ అనుకోవచ్చు.
ధర: రూ.1,299
దొరుకు చోటు: అమెజాన్

ఇంటిని ఫొటో ఫ్రేమ్‌లతో, డెకరేషన్ వస్తువులతో అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ గోడలకు మేకులు కొట్టాలంటే పెయింట్ పాడవుతుందని, రంధ్రాలు పడతాయని భయం. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇదో పెద్ద సమస్య. ఈ తిప్పలు లేకుండా, గోడను అస్సలు పాడు చేయకుండానే Zulaxy Photo Frame Hooksతో వస్తువులను తగిలించుకోవచ్చు. ఇవి సెల్ఫ్ అడెసివ్ హుక్స్. అంటే వీటికి వెనక వైపు ఉండే స్టిక్కర్‌ను తీసి నేరుగా గోడకు అతికించేయొచ్చు. మేకులు కొట్టాల్సిన, డ్రిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే.. ఒక్కో హుక్ దాదాపు 10 కేజీల వరకు బరువును మోయగలదు. వీటిని టైల్స్, గ్లాస్, మెటల్, చెక్క తలుపుల మీద కూడా సులభంగా అతికించుకోవచ్చు. ఇవి వాటర్‌ప్రూఫ్, రస్ట్‌ప్రూఫ్. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో తయారవ్వడం వల్ల బాత్రూమ్లో వాడినా తుప్పు పట్టవు. వీటిని తీసేసినప్పుడు గోడకు ఎలాంటి మరకలు పడవు.
ధర: రూ.269 (10 హుక్స్ల ప్యాక్)
దొరుకు చోటు: అమెజాన్