నేడు రాష్ట్ర వ్యాప్తంగా నీట్
రాష్ట్రవ్యాప్తంగా నీట్-2026 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్ తెలిపారు.
- 199 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ : డీఎంఈ
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నీట్-2026 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగనున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో 73,084 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్టు వివరించారు.
నిరుడుతో పోలిస్తే 517 అభ్యర్థులు పెరిగినట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్టు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పెన్ను, పేపర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నీట్ అడ్మిషన్ కార్డు, ఐడీ ఫ్రూఫ్, పాస్పోర్టు సైజ్ ఫొటో తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఫోన్లు, డిజిటల్ వాచ్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

