విజయాలు వైఫల్యాలు
బలమైన నాయకత్వం ఉన్న ఏ అంకుర సంస్థ కూడా వైఫల్యాల బాట పట్టదు సరికదా తనకు ఎదురైన సవాళ్లు అధిగమించి వాటిని సరికొత్త అవకాశాలుగా మార్చుకుంటుంది.
బలమైన నాయకత్వం ఉన్న ఏ అంకుర సంస్థ కూడా వైఫల్యాల బాట పట్టదు సరికదా తనకు ఎదురైన సవాళ్లు అధిగమించి వాటిని సరికొత్త అవకాశాలుగా మార్చుకుంటుంది. దూరదృష్టి, అవకాశాలను అందిపుచ్చుకోగల సామర్థ్యం, వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధానాలు, వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆర్థిక నైపుణ్యం ఏ సంస్థ విజయానికైనా కీలకం. అదే సమయంలో ఖర్చును అదుపు చేసుకుంటూనే ఎదగడానికి అనుకూలమయ్యే విధానాలు (స్కేలబుల్ బిజినెస్ మోడల్), మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి.
స్టార్టప్‌లు విఫలం కావటానికి కొన్ని అంతరంగ సమస్యలతో పాటు బయట అంశాలు కూడా కారణమవుతాయి. మార్కెట్‌ను అధ్యయనం చేయటంలో, వినియోగదారులను అర్థం చేసుకోకపోవటంలో వైఫల్యాలు, బిజినెస్ వ్యవహారాల్లో సాంకేతిక సామర్థ్యం కొరవడటం లాంటివి స్టార్టప్‌లు విఫలం కావటానికి ప్రధాన కారణాలని సీబీ ఇన్ సైట్స్, విల్ బర్ట్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడైంది. వాటితో పాటు ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, ఫండింగ్ ఇష్యూలు ఎలాగూ ఉండనే ఉంటాయి.
వాటిలో మరికొన్ని కారణాలు చెప్పాలంటే..
- గిరాకీ లేని ఉత్పత్తుల పైన దృష్టి పెట్టటం వల్ల అవి వైఫల్యాల బాట పడతాయి. 42 శాతం స్టార్టప్‌లు ఇలాగే దెబ్బతిన్నాయి.
- నగదు కొరత ఆర్థికంగా నిర్వహణా వైఫల్యాలు, ఖర్చులపైన అదుపు లేకపోవటం. 29 శాతం స్టార్టప్‌ల వైఫల్యానికి కారణం అని తేలింది.
- సరైన బృందం లేకపోవటం, సమర్థమైన నాయకత్వం, బృంద సభ్యులలో నైపుణ్యాలు కొరవడటం లాంటి కారణాల 23 శాతం స్టార్టప్‌లు విఫలమయ్యాయి అని ఓ నివేదిక.
- మార్కెట్ అవసరాలకు అనుగుణమైన మార్పులు చేయకపోవడం వల్ల 17 శాతం స్టార్టప్‌లు వైఫల్యాన్ని మూటగట్టుకున్నాయి.
2026 ప్రారంభం నాటికి దాదాపు 128 స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొందాయి. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఈ కామర్స్, డీప్‌టెక్ రంగాలు ఇందులో ప్రధానమైనవి. స్టార్టప్‌లు దాదాపు 21.9 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. అంకుర సంస్థల్లో కెరీర్ వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో చాలామంది స్టార్టప్‌లలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అక్కడ భిన్నమైన అంశాలను నేర్చుకోగలిగే వాతావరణం ఉండటంతో పాటు త్వరగా గుర్తింపు లభించడం కూడా ఉద్యోగస్తులను స్టార్టప్స్ ఆకర్షిస్తున్నాయి. తమను తాము నిరూపించుకోవాలి, త్వరత్వరగా ఎదగాలి అనే దృక్పథంతో ఉండే స్టార్టప్ యాజమాన్యాలు కూడా సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేసుకుని ఎక్కువ జీతం ఇచ్చి పని చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఇప్పటికీ నిపుణుల కొరత ఈ రంగాన్ని వేధిస్తున్నది. 55 శాతం స్టార్టప్‌లు సామర్థ్యం ఉన్న వృత్తి నిపుణులు లేక సతమతమవుతున్నాయని అంచనా! మరోవైపు పెట్టుబడిదారులు దీర్ఘకాలిక వృద్ధి గురించి కాకుండా లాభాల గురించి చూడటంతో 2024 చివరి నాటి నుంచి సీడ్ ఫండింగ్ బాగా తగ్గుముఖం పట్టింది. మరో వైపు చిన్న నగరాల్లో మౌలిక సదుపాయాల ధరలు పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం కూడా ఆర్థిక అభివృద్ధి, మహిళల స్వావలంబన కోసం అంకుర సంస్థలు కీలకం అని గుర్తించింది. 2030 నాటికి మహిళా ఆధారిత స్టార్టప్‌లు 14 నుంచి 25 శాతానికి పెరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో 43 శాతం అంటే 73 వేల వరకూ స్టార్టప్‌లను మహిళలే నిర్వహిస్తుండటం గర్వకారణమే. 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా సంస్థ ఈ రంగం వృద్ధికి ఇతోధికంగా చర్యలు తీసుకుంటున్నది. పెట్టుబడి అధికంగా అవసరమైన ఈవీలు, రొబోటిక్ వంటి రంగాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అవకాశాలను వృత్తి నిపుణులు అందిపుచ్చుకుంటే మరిన్ని స్టార్టప్‌లు వెలుగు చూస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

