వర్షకాలం వచ్చిందంటే చాలు గొంతు, శ్వాస సంబంధ సమస్యలు బాధిస్తాయి. వర్షాలు, వరదల కారణంగా నీటి కాలుష్యం, తద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువ. ముఖ్యంగా జలుబు, జ్వరం, గొంతులో గరగర, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఘాటైన సూప్‌లు చక్కని పరిష్కారం. ఈ సూపులను అల్లం, వెల్లుల్లి, మిరియాలు దట్టించి ఘాటుగా రకరకాల ఫ్లేవర్లలో ఆస్వాదించవచ్చు.
టమాట, క్యారెట్, క్యాప్సికమ్, బ్రొకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయల్నీ జోడించవచ్చు. కొత్తిమీర, పాలకూర, మెంతి, తోటకూర వంటి ఆకుకూరల రుచులనూ జత చేసుకోవచ్చు. సూప్ తేలికైన ఆహారం. ఇట్టే జీర్ణం అవుతుంది.