పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
మానవత్వాన్ని చాటే కథలు
సాదత్ హసన్ మంటో పేరు వినగానే ఉర్దూ కథా కథనంలో ఆయన సాటిలేని శైలి, దేశ విభజన నేపథ్యంలో రాసిన అద్భుతమైన కథలు గుర్తుకువస్తాయి. మంటో రాసిన 17 కథలను తెలుగులో అనువదించి… ‘అనార్కలి’ పేరుతో సంకలనంగా తీసుకువచ్చారు అమ్జద్ అలీ. ఇవన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితంఅయ్యాయి. ‘అనార్కలి’ కథలో నాయకుడికి తాను ఇష్టపడి, తనను ఇష్టపడని అందగత్తెనే సంబంధంగా వస్తుంది. అదే విషయం తండ్రికి చెప్తే, ఆ అమ్మాయికి నచ్చావో లేదో కనుక్కున్న తర్వాతే పెళ్లి సంగతి అంటాడాయన. అలా ఈ కథ వివాహాల్లో స్త్రీల నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశం ఇస్తుంది. ఇక ‘టోబ టేక్సింగ్’ మంటో మారుపేరుగా నిలిచిన కథ. మానసిక రోగి అయిన ఓ ఖైదీ హిందుస్థాన్-పాకిస్తాన్ దేనికీ చెందకుండా సరిహద్దుల్లో మరణించిన ఉదంతం ఇతివృత్తంగా రాసిన ఈ కథ దేశ విభజన నేపథ్యంలో వచ్చిన గొప్ప రచన. ‘బాయ్! బాయ్!’, ‘తెరిచెయ్’, ‘సహాయ్’ కథలు కూడా దేశ విభజన సమయంలో ప్రజల్లో ఒకరిపట్ల మరొకరికి ఉన్న అనుమానాలు, మనుషులనే సంగతి మరిచిపోయి ఒకరి నొకరు వంచించుకున్న సంఘటనలను చిత్రిస్తాయి. స్త్రీ, పురుషుల ఆంతరంగిక విషయాలు, అక్రమ సంబంధాలు, స్నేహితుల వెన్నుపోట్లు, మతం కంటే మానవత్వం గొప్పదనే విషయం, నిరుద్యోగుల అగచాట్లను ‘అనార్కలి’ కథలు కండ్లకు కడతాయి. అమ్జద్ అనువాదం కూడా చదివించే శైలిలో సరళంగా సాగిపోతుంది.
అనార్కలి
రచన: సాదత్ హసన్ మంటో
అనువాదం: అమ్జద్ అలీ
పేజీలు: 144, ధర: రూ. 100
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ఫోన్: 98487 87284
నవలా నైవేద్యం (సింహప్రసాద్ 21 నవలల పరిశీలన)
Books2
రచన: శృంగవరపు రచన
పేజీలు: 116, ధర: రూ. 80
ప్రచురణ: ఆవిర్భవ ప్రచురణ
ప్రతులకు: ఇ-మెయిల్: srungavarapu.rachana@gmail.com
భానుమతి (నవల)
Books1
రచన: గంగపట్నం దేవకి రెడ్డి
పేజీలు: 166
ధర: రూ. 200
ప్రతులకు:
ఫోన్: 79818 20825
సమాహారం (కథలు)
Books
రచన: శరత్చంద్ర
పేజీలు: 293, ధర: రూ. 200
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
ఫోన్: 98492 41286
…? చింతలపల్లి హర్షవర్ధన్