మనదేశంలో ప్రతి గ్రామం పేరు వెనకా ఓ చరిత్ర ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ కూడా దీనికి మినహాయింపు కాదు. తాలూకా కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గం అయిన బోథ్ పూర్వనామం బొంతల. సహ్యాద్రి పర్వతశ్రేణిలో భాగమైన గుట్టల్లో చక్కగా ఒదిగిపోయిన బోథ్ కండ్లు తిప్పుకోనివ్వని ప్రకృతి సౌందర్యానికి చిరునామా. ఈ ఊరి మీదుగా పారే పెద్దవాగు మీద నెలకొన్న పొచ్చెర జలపాతం ఇక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. ఇక చలికాలంలో బోథ్ వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది.
దీన్ని తట్టుకోవడానికి అక్కడి ప్రజలకు బొంతలు, పచ్చడాల అవసరం ఉండేది. దీనికి అనుగుణంగా బోథ్‌తోపాటు పరిసర గ్రామాలకు బొంతలు, పచ్చడాల సరఫరా అక్కడినుంచే జరిగేది. అలా బోథ్‌కు ‘బొంతల’ అనే నామాంతరం స్థిరపడింది. ఇక బోథ్‌లో జన్మించిన విశ్రాంత ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఆ ఊరితో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ‘బొంతల ముచ్చట్లు’ నోస్టాల్జియా రాశారు.
బోథ్ నైసర్గిక స్వరూపం, పేరు చరిత్ర, తను పుట్టిన నక్షత్రం, అమ్మానాన్నలతో అనుబంధం, పెద్దవాగు ముచ్చట, అక్కడ జరుపుకొనే పండుగలు, మనుషుల మధ్య సామరస్యం, గణపతి మండపంలో సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వాద్య కచేరి, ఒకప్పుడు గ్రామాల్లో సినిమా ప్రదర్శనలు ఇచ్చిన టూరింగ్ టాకీస్లు మొదలైన స్మృతులతో సాగిన ఈ ‘బొంతల ముచ్చట్లు’ పాఠకులకు బోథ్ వైభవాన్ని కండ్లకు కడుతుంది. ప్రముఖ యాత్రా రచయిత పరవస్తు లోకేశ్వర్ చెప్పినట్టు ఈ పుస్తకం పాఠకులతో… బొంతల గ్రామం పురాతన మట్టి మిద్దెల ముందు, కాలిబాటల మట్టి మీద ‘హెరిటేజ్ వాక్’ చేయిస్తుంది. అదే సమయంలో తమ ఊళ్లతో పెనవేసుకున్న అనుబంధాన్నీ గుర్తుకుతెస్తుంది.
రచన: శ్రీధర్‌రావు దేశ్‌పాండే
పేజీలు: 197; ధర: రూ. 200
ప్రచురణ: వెన్నెల – గీత ప్రచురణలు
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్
ఫోన్: 94910 60585
రచన: అమ్జద్
పేజీలు: 140;
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:ఫోన్: 73375 92686
రచన: శివకృష్ణ కొక్కుల
పేజీలు: 82;
ధర: రూ. 120
ఫోన్: 99896 27222
రచన: డా॥ కొండపల్లి నీహారిణి
పేజీలు: 296; ధర: రూ. 300
ప్రతులకు: ఫోన్: 98494 68931