సినిమాలకు సంబంధించి 1980లలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్! కథ, నటన, దర్శకత్వం అన్నీ చూసుకునే ఆల్రౌండర్ ఆయన! సినిమాలో పెద్ద హీరోలున్నా… ఆయన పేరు చెబితే చాలు జనం బారులు తీరేవారు. కాసుల వర్షం కురిసేది. సినిమా హిట్ అయ్యేది. ఆయనేమి యాక్షన్ హీరో కాదు.. మన మధ్య తిరిగే ఒక సాధారణ మనిషిలానే ఉండేవాడు. అమితాబ్ తొలుత వాదులాడినా చివరికి ఆ కుర్ర డైరెక్టర్ చెప్పిన విధంగా తన శైలి మార్చుకొని నటించి హిట్ కొట్టాడు. ఆయన ఎవరో కాదు తమిళ దర్శకుడు భాగ్యరాజా! ఆయనంటే ఆ రోజుల్లో కుర్రకారుకు విపరీతమైన పిచ్చి! దాంతో దర్శక నిర్మాతలు భాగ్యరాజా వెంటపడేవారు. నవ్విస్తూనే సందేశం ఇచ్చే సినిమాలని ఎన్నో ఆయన నిర్మించారు.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో మాట పట్టింపు వచ్చి తన సినిమాలకు తనే సంగీతం సమకూర్చుకున్న మొండి మనిషి. సినిమా ప్రియులకు, దర్శకులు కావాలనుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉండేలా తమిళంలో భాగ్యరాజా రాసిన పుస్తకాన్ని శ్రీనివాస తెప్పాల అనువదించగా.. మార్పులు చేర్పులు జోశ్యుల సూర్యప్రకాష్ చూసుకున్నారు. ‘భాగ్యరాజా డి కోడెడ్’ అన్న ఈ పుస్తకంలో ప్రతి అక్షరం మనసుకు పట్టేలా ఉంటుంది. భాగ్యరాజా వెండితెర ప్రస్థానంతోపాటు భారతీరాజా, బాలచందర్, బాలు మహేంద్ర, వెండితెర వేల్పులు అమితాబ్, చిరంజీవి వంటి వారు ఆయన గురించి చెప్పిన విశేషాలు చదువరులను అలరిస్తాయి. సినీ ప్రేమికులందరూ చదివితీరాల్సిన పుస్తకం ఇది.
తమిళ మూలం: భాగ్యరాజా
అనువాదం: తెప్పాల శ్రీనివాస్
పేజీలు 178, ధర: రూ.200
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 62812 88424
– చంద్ర ప్రతాప్ కంతేటి
రచన: డా.వి.శంకర్
పేజీలు: 141;
ధర: రూ. 150
ప్రచురణ: తెలంగాణ
ప్రతులకు: రచయితల సంఘం
ఫోన్: 94407 98954
రచన: సురేఖ పులి
పేజీలు: 110;
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ఫోన్: 98487 87284