ఆర్థిక సంస్కరణల తర్వాత నగరీకరణ వేగం పెరిగింది. పెద్ద నగరాలకు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా పట్టణీకరణ ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ క్రమంలో పంటపొలాలు మాయమైపోతున్నాయి. భూమినే నమ్ముకొని బతుకు వెళ్లదీసిన మనుషులకు ఇలాంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా పరిణమించడం సహజమే. పాత్రికేయులు ఎ.యం.అయోధ్యా రెడ్డి ‘సీతంబాయి పొలం’ కథ ఈ ఇతివృత్తంతోనే నడుస్తుంది. తరతరాలుగా అనుభవిస్తున్న పొలం అమ్మకం కోసం రియల్ ఎస్టేట్ వేలానికి వెళ్లాలనే నవతరం పిల్లలకు సర్దిచెప్పుకోలేక ప్రాణాలు విడిచిన ఓ రైతు కన్నీటికథ ఇది.
ఈ సంకలనంలో మిగిలిన కథలు మన కళ్లెదుట జరుగుతున్న సంఘటనల నేపథ్యంగా సాగినవే కావడం గమనార్హం. ‘ఆరడుగుల శ్వాస’ కథ కరోనా సమయంలో విధి నిర్వహణకు బద్ధుడైన ఓ పూజారి జీవితం విషాదాంతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. మరో కథ ‘పనిపిల్ల’ సమాజంలో నెలకొన్న ఆర్థిక అంతరాలను, బాల కార్మికుల దైన్యస్థితిని వివరిస్తుంది. ఇక ‘నూరో బిచ్చగాడు’ కథ ప్రతికూల పరిస్థితుల్లో చెక్కుచెదరని విశ్వాసాన్ని ప్రకటించిన ఓ మహిళ, తన జీవితం విషయంలో ఏ నిర్ణయం తీసుకుందో తెలుపుతుంది. ‘వేలాడిన న్యాయం’ కథ అన్యాయంగా ఉరికొయ్యకు వేలాడిన ఓ నిరపరాధి అంతరంగ సంఘర్షణను కండ్లకు కడుతుంది. రచయిత అయోధ్యా రెడ్డి పేర్కొన్నట్టు ‘సీతంబాయి పొలం’ కథలు జీవనస్పర్శతో రాసినవి.
రచన: ఎ.ఎం. అయోధ్యా రెడ్డి
పేజీలు: 136.
ప్రచురణ: గౌతమి ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 93999 62117
రచన: డా.లక్ష్మీ రాఘవ
పేజీలు: 176;
ధర: రూ. 150
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 94401 24700
రచన: అగరం వసంత్
పేజీలు: 138;
ధర: రూ. 200
ప్రతులకు:
ఫోన్: 94883 30209
రచన: గోశికొండ మురారి పంతులు
పేజీలు: 216;
ధర: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 89789 74367