మనిషి జీవితం కదలికలపైనే ఆధారపడుతుంది. తేడా వచ్చిందంటే జీవితం తారుమారవుతుంది. అహంతో కొట్టుకునే మనిషి ‘ప్రతిభ’ ప్రకృతి ముందు పిపీలికం. ఈ సత్యాన్ని ఎన్నో సంఘటనలు పదేపదే రుజువు చేస్తున్నాయి. హనీమూన్‌కు వెళ్లిన ఒక యువజంట తమ ప్రణయయాత్రలో ఎదుర్కొన్న దుస్సంఘటనల నేపథ్యాన్ని అక్షరీకరిస్తూ డాక్టర్ టి. సంపత్‌కుమార్ రచించిన నవలే ‘కదలికలు’. అడుగడుగునా ఉత్కంఠ.. చదివించే గుణం ఈ నవలకు ప్రాణం. దుస్సంఘటనలు ఎదురైనా ఆ నవజంట వాటిని ఎలా ఎదుర్కొంది? ఆయా పరిణామాలకు ఎలా ప్రతిస్పందించింది అనేది కీలకం.
ఇదే ఈ నవలకు ఆయువుపట్టు. కష్టాలు అందరికీ ఎదురవుతాయి వాటినుంచి తెలివిగా ఎలా బయటపడ్డాం అన్నదే ముఖ్యం. అంతేకాదు ఆయా సందర్భాల్లో వాటిల్లిన నష్టాన్ని ఏ రకంగా భర్తీ చేసుకోవచ్చు అనే విషయం కూడా ఈ నవలలో స్ఫూర్తిదాయకంగా చెప్పారు రచయిత. మొదట్లో ట్రావెలాగ్‌లా అనిపించినా తర్వాత తర్వాత నవల అనేక మలుపులు తిరుగుతుంది. సాధారణ పాఠకుడికి తెలియని ఎన్నో విషయాలను చెబుతుంది. నవల ఆసాంతం చదివిన వారికి ఖజురహో చిత్రం కవర్‌పేజీగా ఎందుకు వేశారో స్పష్టమవుతుంది. పేరు నుంచి కథా వస్తువు వరకు, కథా సంవిధానం వరకు నవ్యత కనిపించేలా కృషిచేశారు రచయిత. వైవిధ్యభరిత రచనలు చదవాలనుకునే వారికి ఉపకరించే రచన. జీవనయానంలోని ఎత్తుపల్లాలను రచయిత సంపత్ కుమార్ హృద్యంగా చెప్పారు.
కదలికలు (నవల)
రచన: డా. టి. సంపత్ కుమార్
పేజీలు: 142; వెల: రూ. 160
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 92474 71361
ప్రణవి నండూరి
బుక్ షెల్ఫ్
కైవల్య
రచన: ఆచార్య
అనుమాండ్ల భూమయ్య
పేజీలు: 50
వెల: రూ. 80
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 88970 73999
పాడే పక్షులు (బాలల అనువాద కథలు)
అనువాదం: ఒద్దిరాజు మురళీధర్‌రావు
పేజీలు: 79
వెల: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 99082 21920
జైళ్ళు ఖైదీలు
రచన: దామరపల్లి
నర్సింహ్మారెడ్డి
పేజీలు: 92
వెల: రూ. 230
ప్రతులకు:
ఫోన్: 95813 58696