Prabhas and Disha Patani | ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ భేషైన భోజనప్రియుడు. ఆతిథ్యంలో అందెవేసిన చేయి. కమ్మకమ్మని వంటలు వండిస్తాడు. కొసరికొసరి వడ్డిస్తాడు. బెస్ట్ కాంబినేషన్లు ఏమిటన్నదీ చెబుతాడు. అసలు ఎలా వండారన్నది కథలు కథలుగా వర్ణిస్తాడు. ప్రభాస్ ఏ సినిమా షూటింగ్లో ఉంటే ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసేవారికంతా తన ఇంటి నుంచే భోజనం పంపిస్తుంటాడు.
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, పూజా హెగ్డే, భానుశ్రీ.. ఇలా ప్రభాస్ విందు ఆరగించినవారి జాబితా చాలా పెద్దదే. ఇప్పుడు ఈ జాబితాలో దిశా పఠానీ కూడా చేరింది. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో దిశ కథానాయిక. షూటింగ్ తొలిరోజు దిశకు వెల్కమ్ చెబుతూ ప్రభాస్ విందు పంపాడట. ఈ విషయాన్ని దిశ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. హాట్ క్యారియర్లు ఉన్న ఫొటోలు పెట్టి ‘థ్యాంక్ యూ ప్రభాస్ సర్.. ఇలా నోరూరించే వంటలు పంపి మమ్మల్ని చెడగొడుతున్నారు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
Disha Patani | పర్ఫూల్ కలర్ మినీ స్కర్ట్‌లో సెగలు పుట్టిస్తున్న దిశా పటాని..”
“Disha Patani | గ్లామర్ షోతో కుర్రకారు మనసులు కొల్లగొడుతున్న దిశా పటాని..”
“సీరియస్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?”
Disha patani: లోఫర్ బ్యూటీకి సర్జరీ వికటించిందా?”