ఈ మధ్య కాలంలో అందాల ముద్దుగుమ్మలు సర్జరీలు చేయించుకుంటూ గ్లామర్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. శృతి హాసన్ అయితే తాను సర్జరీ చేయించుకున్నట్టు ఓపెన్ కామెంట్ చేయగా, మరి కొందరు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే లోఫర్ బ్యూటీ దిశా పటానీ కూడా సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య అయేషా టాకీయా పేదవులకు సర్జరీ చేసుకోగా అది వికటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కూడా సర్జరీ చేయించుకుందని, దాంతో ఆమె ముఖం చూడలేనట్టుగా మారిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా లోఫర్ బ్యూటీ దిశా పటానీని చూసిన వారు చాలా మంది ఆమె సర్జరీ చేయించుకుందని, మొహం దారుణంగా మారిందని కామెంట్స్ చేశారు.
సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం అంతిమ్ స్పెషల్ స్క్రీనింగ్ నిన్న(శుక్రవారం) జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హజరైన దిశ ఎల్లో టాప్, డెనిమ్ జీన్స్‌తో దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ దిశ లుక్‌లో ఎదో తేడాను గమనించారు నెటిజన్లు. ఇంకేముంది తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.