ల్యాప్‌టాప్/ డెస్క్‌టాప్ వాడుతున్నారా? ఒకేసారి పెన్‌డ్రైవ్, మొబైల్, మౌస్ కనెక్ట్ చేయాల్సిన అవసరం వస్తున్నదా? యూఎస్బీ పోర్ట్‌లు సరిపోక ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఇది సమస్యే కాదు. ఎందుకంటే.. దీనికి సింగిల్ సొల్యూషన్ దొరికింది. అదే Bestor 4 Port USB Hub. ఇది మీ ల్యాప్‌టాప్ కెపాసిటీని పెంచే సూపర్ డీల్. తక్కువ బడ్జెట్లో, ఈ హబ్ మీ అన్ని కనెక్టివిటీ అవసరాలను తీరుస్తుంది. 4 ఇన్ 1 పవర్ అన్నమాట. ఒక యూఎస్బీ పోర్ట్ ఖాళీగా ఉంటే చాలు. అదనంగా నాలుగు పోర్ట్‌లను యాడ్ చేయొచ్చు. కీబోర్డ్‌లు, మౌస్‌లు, ఫ్లాష్ డ్రైవ్‌లు, ప్రింటర్లు.. ఇలా నాలుగు గ్యాడ్జెట్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయొచ్చు. డేటా ట్రాన్స్ఫర్ విషయంలో అస్సలు ల్యాగ్ చేయదు. దీని స్పీడ్ ఏకంగా 480 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. పెద్ద ఫైల్స్, ఫొటోలు, వీడియోలను కూడా వేగంగా పంపేయొచ్చు. ఇది ప్లగ్ అండ్ ప్లే ఫీచర్‌తో వస్తుంది. అంటే, దీన్ని కనెక్ట్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవసరం లేదు. విండోస్, మ్యాక్, లైనక్స్.. ఇలా ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా స్మూత్‌గా పని చేస్తుంది. చాలా కాంపాక్ట్‌గా, లైట్ వెయిట్‌గా ఉండే ఈ హబ్‌ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ధర: రూ. 350
దొరుకుచోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ట్రావెల్ చేస్తున్నప్పుడో, ఆఫీస్ పనులపై బయటికి వెళ్లినప్పుడో.. మొబైల్ చార్జింగ్ కేబుల్, ల్యాప్‌టాప్ కేబుల్, డేటా కేబుల్.. ఇలా బోలెడు వైర్లు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో అన్ని వైర్లు చిక్కుపడి బ్యాగంతా చిందరవందర అవుతుంది. కావాల్సిన వాటిని తీసుకోవడం కష్టం అవుతుంది. ఇలాంటి ఇష్యూ ఉండొద్దు అనుకుంటే.. ఓ సింగిల్ సొల్యూషన్ ఉంది. అదే Portronics Snapcase 3. ఇది చూడటానికి చిన్న బాక్స్లా ఉంటుంది. కానీ, లోపల పెద్ద సెటప్ ఉంటుంది. కిట్‌లో ఉండే కేబుల్ 60 వాట్స్ మ్యాక్స్ అవుట్‌పుట్ ఇస్తుంది. దీంతో మీరు మీ టైప్-సి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, మొబైల్స్‌ను అల్ట్రా-ఫాస్ట్‌గా చార్జ్ చేయొచ్చు. ఒక్క కేబుల్ ఉంటే చాలు. టైప్-సి నుంచి మైక్రో యూఎస్బీ, యూఎస్బీ-ఎ లకూ మార్చుకోవచ్చు. మల్టిపుల్ కేబుల్స్ మోసుకెళ్లాల్సిన టెన్షన్ ఉండదు. ఇది చార్జింగ్తోపాటు మెరుపు వేగంతో డేటా ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది. దీంట్లో సిమ్ ఎజెక్ట్ పిన్, సిమ్‌కార్డ్, ఎస్డీ కార్డ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన స్లాట్స్ కూడా ఉంటాయి. ట్రావెలర్స్‌కి ఎంతో ఉపయుక్తం.చాలా కాంపాక్ట్‌గా, డ్యూరబుల్‌గా ఉంటుంది. జేబులో, చిన్న పర్స్‌లో లేదా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో ఈజీగా ఫిట్ అవుతుంది.
ధర: రూ. 500
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

రోజువారీ జీవితంలో మీటింగ్స్, ఇంటర్వ్యూలు, లెక్చర్లు లేదా క్లాసుల్లో ముఖ్యమైన విషయాలను రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా వాయిస్ రికార్డర్‌ను పట్టుకెళ్తే కొందరు అనుమతించరు. అందుకే సీక్రెట్‌గా రికార్డ్ చేసుకుంటే బెటర్ కదా. ఈ సమస్యకు కూల్ సొల్యూషన్.. ఈ Smars బ్లాక్ వాయిస్ రికార్డర్ కీ చెయిన్. ఇది చూడటానికి మామూలు కీ చెయిన్లాగా కనిపిస్తుంది. కానీ, ఇదో మల్టీ ఫంక్షన్ డివైజ్. ఇది ఒక వాయిస్ రికార్డర్ మాత్రమే కాదు. ఇందులో 8జీబీ మెమొరీ ఉంది. దీంతో మీరు ఎంపీ3 ప్లేయర్‌గా, యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్గానూ వాడుకోవచ్చు. దీన్ని వాడటం కూడా చాలా ఈజీ. పవర్ ఆన్ చేస్తే చాలు.. రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్ చేస్తే ఫైల్స్ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే.. ఏకంగా 28 గంటల వరకు కంటిన్యూగా రికార్డ్ చేయగలదు. స్టాండ్బైలో అయితే 60 రోజులు ఉంటుంది. రికార్డ్ అవుతున్నప్పుడు ఎలాంటి సౌండ్ రాదు, లైట్ కూడా వెలగదు. ఎవరికీ తెలియకుండా కాన్ఫిడెన్షియల్ సంభాషణలను రికార్డ్ చేయొచ్చు. నాయిస్ రిడక్షన్ ఫీచర్ ఉండటం వల్ల వాయిస్ కూడా చాలా క్లియర్‌గా వినిపిస్తుంది.
ధర: సుమారు రూ.1,200
దొరుకు చోటు:అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ఇళ్లలో, ఆఫీసుల్లో సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకోవడం ఇప్పుడు అనివార్యం. కానీ, కొన్ని కెమెరాలను ఫిట్ చేయడానికి బోలెడు వైర్లు, పెద్ద సెటప్‌లు అవసరం. అది కాకుండా, కెమెరా ఉందని ఇతరులకు తెలిసిపోతే.. అలర్ట్ అయిపోతారు. మరైతే, కెమెరా ఉన్నట్లు తెలియకుండా.. ఇళ్లు, ఆఫీసుల్లో ఓ కన్నేసి ఉంచాలంటే!? పర్ఫెక్ట్ సొల్యూషన్ ఈ SECURINNOV వై-ఫై సర్వైలెన్స్ కెమెరా. ఫ్లెక్సిబుల్ నెక్‌తో దీన్ని ఎక్కడైనా దాచొచ్చు. దీనికి మెటల్ ఫ్లెక్సిబుల్ పైప్ ఉంటుంది. దీంతో ఈ కెమెరాను 360 డిగ్రీలు తిప్పి, మీకు కావాల్సిన కోణంలో ఫిట్ చేయొచ్చు. 1080p హెచ్డీ రిజల్యూషన్‌తో వీడియోను రికార్డ్ చేస్తుంది. దీంతో విజువల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. రియల్ టైమ్‌లో మీ మొబైల్ యాప్‌లో లైవ్ వ్యూ చూడొచ్చు.ఫుటేజ్ స్టోరేజ్ కోసం 256జీబీ వరకు మెమొరీ కార్డును సపోర్ట్ ఉంది. మోషన్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఏవైనా అనుమాన్పద కదలికలు కనిపిస్తే వెంటనే అలర్ట్ పంపిస్తుంది.
ధర: రూ.1,500
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్