Emotive Expressions | ప్రతి ఫొటో వెనుక.. ఒక కథ ఉంటుంది. ఒక ఎమోషన్ (భావోద్వేగం) ఉంటుంది. ఆ భావోద్వేగాలనే ఫొటోలుగా మలిస్తే.. ‘ఎమోటివ్ ఎక్స్ప్రెషన్స్’ ఫొటోగ్రఫీ (Emotive Expressions) అవుతుంది.
ఒక చిరునవ్వు, ఓ కన్నీటి చుక్క, ఆశ్చర్యం, ప్రేమ.. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చూపించే ముఖాలు ఫొటోను ఎంతో బలమైన దృశ్యంగా మార్చేస్తాయి. ఇలాంటి ప్రత్యేకమైన ఫొటోలు మొబైల్ ఫోన్ సహాయంతోనూ అత్యద్భుతంగా క్యాప్చర్ చేయొచ్చు. అందుకు కావాల్సింది.. కేవలం సమయం కోసం వేచి ఉండటమే!
ఎమోటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే.. వ్యక్తులు చూపించే సహజమైన భావోద్వేగాలే.. ఎమోటివ్ ఎక్స్ప్రెషన్స్! మనిషి సంతోషంలో నవ్వుతున్నా.. బాధలో ఏడుస్తున్నా.. ఆశ్చర్యంలో మునిగిపోయినా.. ప్రేమగా చూస్తున్నా.. భయంతో కంపించిపోతున్నా.. అతని కళ్లలో, ముఖంలో, శరీర భాషలో అందుకు సంబంధించిన భావోద్వేగాలు పలుకుతుంటాయి. వాటిని బంధించడమే.. ఎమోటివ్ ఎక్స్ప్రెషన్స్ ఫొటోగ్రఫీ! ఈ ఫొటోలు.. తమకే సొంతమైన కథలను చెబుతాయి. సజీవంగా, సహజత్వంగా ఉండి.. వీక్షకుల్లో స్పందనను కలిగిస్తాయి.

టిప్స్ :
1. సహజత్వంపై దృష్టిపెట్టండి. ప్రాకృతిక విషయాల మీద పట్టు సాధించండి. అప్పుడే.. సహజమైన ఎమోషన్స్ పండుతాయి. వాటిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి.
2. మోడల్‌కు అనుకూలంగా ఉండే వాతావరణం కల్పించండి. పోజులు కాకుండా..
3. కళ్లలోని భావాలను క్యాప్చర్ చేయండి. కళ్లే.. ఆ ఫొటో వెనుక కథను చెబుతాయి.
4. లైటింగ్ సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోండి. హార్ష్ లైటింగ్.. మనిషిలోని భావోద్వేగాలను మార్చేస్తుంది.
5. ఈ ఫొటోగ్రఫీలో టైమింగ్ ముఖ్యం. నిజమైన చిరునవ్వు వచ్చేవరకూ వేచి ఉండండి. ఎక్స్ప్రెషన్ పండిన వెంటనే.. క్లిక్ మనిపించండి.

ఫొటోల్లోని కథను చెప్పే కళ. మీ రోజువారీ జీవితంలో గుర్తించే ఒక్కో ఎక్స్ప్రెషన్ను ఫొటోగా మారిస్తే.. ఆ ఒక్కో ఫొటో ఒక్కో కథ అవుతుంది. మొబైల్ ఫోన్‌తోనూ గొప్పగొప్ప భావోద్వేగాలను సజీవంగా బంధించవచ్చు. ఈరోజే ప్రయత్నించండి. సంతోషంతో నవ్వుతున్న మీ స్నేహితులను, పిల్లల, పెద్దల భావోద్వేగాలను క్యాప్చర్ చేయండి. హ్యాపీ క్లిక్కింగ్!