e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home బతుకమ్మ వాస్తు

వాస్తు

వాస్తు

మేము ఒక దవాఖాన కట్టాలనుకుంటున్నాం.‘ర్యాంపు’ ఎటువైపు ఉండాలో సూచించండి?- వి.రఘురామ్‌, గచ్చిబౌలి
దవాఖానకు ర్యాంప్‌తోపాటు మెట్లుకూడా అవసరం. ఈ రెండిటిలో ర్యాంప్‌ సుమారు 30 మీ. పొడవు వస్తుంది. దాని పొడవు తగ్గాలంటే ‘యు’ ఆకారంలో కట్టొచ్చు. అలా కడితే స్థలం ఎక్కువవుతుంది. ఒకే ఎత్తులో కానీ, ‘యు’ ఆకారంగాకానీ, ఎలా కట్టినా తూర్పు ఆగ్నేయంలో, ఉత్తర వాయవ్యంలో స్థలం పొడవు వెడల్పునుబట్టి దక్షిణ-పశ్చిమదిశలో కూడా ర్యాంప్‌ వేసుకోవచ్చు. ‘స్ట్రెచర్‌ ర్యాంప్‌’ ఎక్కడ వేసినా అది దక్షిణం నుంచి ఉత్తరానికి వాలుగా రావాలి. అంతేకాదు, ర్యాంప్‌ వేసిన చోట తప్పక బాల్కనీ తీసుకొని దానినుంచి దవాఖానలోకి రావడానికి తూర్పు లేదా ఈశాన్యం ద్వారం పెట్టుకోవచ్చు. అత్యవసర మెట్లుకూడా ర్యాంపు పోను ఆగ్నేయ-వాయవ్య, దక్షిణ-పశ్చిమ నైరుతి దిశల్లో వేసుకోవచ్చు. మీరు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ర్యాంప్‌ నిర్మించుకోండి.

వీధిపోటు పడే రోడ్డుమీద రేకులతో కప్పు వేస్తే దోషం పోతుందా? – కృష్ణమోహన్‌రెడ్డి, చంపాపేట్‌
వీధిపోటును అలంకరిస్తే దానిమీద అరిటాకుల పందిరి వేస్తే వీధిపోటు పడదని అనుకోవడం సరికాదు. రోడ్డుపై రేకులు వేసినా రాకపోకలు ఆపగలరా? వీధిపోటు పడిన స్థలాన్ని ఎలాగైనా వాడుకోవాలనే ఉద్దేశ్యంతో తోచిన పరిహారాలు చేసుకుంటూ పోవడం శాస్త్రవిరుద్ధమే అవుతుంది. మీరు పంపిన ప్లాను ప్రకారం, మీ ఇంటికి వీధిపోటు ఉంది. దాన్ని తొలగించాలంటే ఆ మేరకు స్థలం రోడ్డుగా మార్చాలి. దాని హద్దులో కాంపౌండ్‌ కొట్టాలి, దాని లోపల ఇల్లు నిర్మించాలి. అంతేకాని, వీధిపోటు రోడ్డుకు కప్పు వేసినా నిరుపయోగం. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి.

గుడిలో ప్రవచన మంటపం కట్టాలని భావిస్తున్నాం. ఎక్కడ నిర్మించాలో తెలుపగలరు? – ఆదివిష్ణు, కొంపల్లి
ఇహ-పర విజ్ఞానకేంద్రాలుగా, మనిషికి జీవన వైభవాన్ని తెలిపే శిక్షణాలయాలుగా మన పూర్వికులు ఊరూరా ఆలయాలు నిర్మించారు. ఆగమ శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానంతోనే వాటిని నెలకొల్పారు. మనిషి జీవన విధానాన్ని తెలిపే ఆధ్యాత్మిక వేదికలు ఆలయాలు. గుళ్లల్లో ప్రవచన మంటపం అవసరమే. ప్రవచన మంటపాన్ని ఉత్తరం వైపు కాంపౌండ్‌ను తాకకుండా కట్టించండి. ప్రవచనాలకు, ఇతర ఆధ్యాత్మిక క్రతువులకు దానిని వినియోగించుకోవచ్చు.

మా ఇంటి స్థలంలో ఒక పాత బావి ఉంది. దాన్ని పూడ్చి, ఆ ప్రదేశాన్ని కలుపుతూ ఇల్లు కట్టుకోవచ్చా?- కుర్ర జానకీరామ్‌, వికారాబాద్‌
బావి ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం పనికిరాదు. భూమిపైన ఉన్న గుంతలు మూయడం వేరు, బావిని పూడ్చడం వేరు. స్థలంలోని నైరుతిలో, ఆగ్నేయం, పశ్చిమ-దక్షిణాల్లో బావి ఉంటే ఆ భాగాన్ని మినహాయించి మిగతా భాగంలో ఇల్లు కట్టుకోవాలి. అది కాంపౌండ్‌లోకి కూడా రాకుండా జాగ్రత్త పడాలి. ఆ బావి తూర్పు ఈశాన్యంలో, ఉత్తరంలో, వాయవ్యంలో ఉంటూ నీరు ఇంకిపోయి పనికిరానిదైనపుడు దానిని పూర్తిగా పూడ్చి ఇంటి ఖాళీ స్థలంలోకి వచ్చే విధంగా వదలి మిగతాభాగంలో గృహం కట్టుకోవచ్చు. అంతేకానీ, పూడ్చిన బావి గృహంలోకి వచ్చే విధంగా, గోడకిందికి వచ్చేలా నిర్మాణం చేపట్టవద్దు. బావి పూడ్చినప్పుడు గట్టి పడినట్టు అనిపించినా దానిమీద పిల్లరు నిలవదు. కొన్ని రోజుల తర్వాత కుంగిపోయే ప్రమాదం ఉంది. భూమి పుండు (బావి) మానాలంటే శతాధిక సంవత్సరాలు పడుతుంది. మీరు ఈ విషయాలన్నీ గమనించి, తెలిసినవారిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అశ్రద్ధ పనికిరాదు.

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాస్తు

ట్రెండింగ్‌

Advertisement