1 సుమారు 240 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేని జాతీయ రహదారిగా ఓ రోడ్డు గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అది ఏ దేశంలో ఉంది?
2 మే 20న జరిగిన విమాన ప్రమాదంలో ఇరాన్ దేశపు అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన పేరేంటి?
3 జయ బాడిగ అనే తెలుగు మహిళ అమెరికాలో ఓ స్థానిక కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది. ఆ న్యాయస్థానం ఏది?
4 విద్య, శాస్త్ర సాంకేతిక పరిశోధన, వైద్యం, సామాజిక, సాంస్కృతిక, కళా రంగాల్లో సేవలు అందించిన వారికి ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక ‘షా బహుమతి’ ఓ భారతీయ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్తకు లభించింది. ఆయన ఎవరు?
5 ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ‘సురేశ్ ప్రొడక్షన్స్’ మే 21న 60 ఏండ్లు పూర్తి చేసుకుంది. తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో వందకుపైగా సినిమాలు నిర్మించింది. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ఏది?
6 భారతదేశ ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పి, ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ మాజీ చైర్మన్ ఇటీవల మరణించారు. 2006లో భారతదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అందుకున్న ఆ బ్యాంకింగ్ రంగ నిపుణుడు ఎవరు?
7 ఆగ్రా పేరు చెప్పగానే తాజ్మహల్ గుర్తుకువస్తుంది. అయితే, ఈ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని స్వామిబాగ్లో ఓ ఆధ్యాత్మిక గురువు సమాధిని తాజ్మహల్ పోలికలో నిర్మించారు. ఆయన ఏ శాఖకు చెందినవారు?
8 జపాన్లోని కోబ్ నగరం వేదికగా పారా అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. వీటిలో 400 మీటర్ల టీ20 కేటగిరీలో
స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్ప్రింటర్ ఎవరు?
9 దాదాపు ఇరవయ్యేండ్లుగా భారత ఫుట్బాల్ జట్టుకు ఆడుతూ, సాకర్ ఆటకు మారుపేరుగా నిలిచిన క్రీడాకారుడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన ఎవరు?
10 లీ హ్సీన్ లూంగ్ పదవికి రాజీనామా చేయడంతో నగర దేశం సింగపూర్ కొత్త ప్రధానమంత్రిగా మే 15వ తేదీన ఎవరు ప్రమాణం స్వీకారం చేశారు?
1. సౌదీ అరేబియా దేశం రబ్ అల్ ఖలీ ఎడారి గుండా వెళ్తుంది. (జాతీయ రహదారి నం. 10)
2. ఇబ్రహీం రైసి
3. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు
4. శ్రీనివాస్ ఆర్. కులకర్ణి
5. రాముడు భీముడు
6. నారాయణన్ వాఘుల్
7. రాధాస్వామి సత్సంగ్ సంప్రదాయానికి చెందిన శివదయాల్ సాహెబ్
8. దీప్తి జివాంజి
9. భారత ఫుట్బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రి
10.అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ నాయకుడు లారెన్స్ వోంగ్