అమాయకత్వంతో కూడిన అందం.. అందంతో కూడిన అభినయం ఆలియా భట్ ప్రత్యేకతలు. తండ్రి నీడ నుంచి బయటికొచ్చి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిందీ బాలీవుడ్ భామ. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగువారినీ పలకరించబోతున్నది. మొదటి సినిమాలోనే అచ్చతెలుగు అమ్మాయిలా ఒదిగిపోయిన ఉత్తరాది సోయగం ఆలియా భట్ గురించి..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సంఘర్ష్’ సినిమాతో ఆరేండ్ల వయసులోనే బాలనటిగా వెండితెరకు పరిచయమైంది ఆలియా.వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకులుగా కరణ్ జోహర్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ముంబైలో జన్మించినా ఆలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది.
ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత మహేశ్ భట్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఆలియా.. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. మొదటి సినిమాకే టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంది. ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారాలుస్వీకరించింది.
ఆలియాతొలినాళ్లలో అనేక విమర్శలు ఎదుర్కొంది. ప్రేక్షకులను కట్టిపడేసే అభినయంతో ప్రతి విమర్శకూ గట్టిగానే సమాధానం ఇచ్చింది. సినిమా సినిమాకూ వైవిధ్యం ప్రదర్శించి, స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చేసింది తక్కువ చిత్రాలే అయినా, మంచి పేరు తెచ్చుకుంది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా తెరవిందు చేయనుంది. ఫిల్మ్ ప్రమోషన్ వేదిక మీద చీర, సల్వార్ కమీజ్ వంటి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ముద్దుగా తెలుగులో మాట్లాడిందీ ముద్దుగుమ్మ.
రణ్‌బీర్ కపూర్, ఆలియా బాలీవుడ్లోనే మోస్ట్ పాపులర్ లవ్‌బర్డ్స్ గా పేరొందారు. ఇద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం రణ్‌బీర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’తో పాటు ‘గంగూబాయి కతియావాడి’, ‘సడక్-2’, ‘తఖ్త్’ తదితర సినిమాల్లో నటిస్తున్నది ఆలియా.
సోషల్ మీడియాలో ఆలియా ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అందమైన ఫొటోలు, ఆసక్తికరమైన కబుర్లతో ఆన్లైన్లో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. కరోనా కష్టకాలంలో ‘ జాగ్రత్తగా ఉండండి. ఎవరూ భయపడవద్దు. మనం ఈ సంక్షోభాన్ని కచ్చితంగా ఎదుర్కొంటాం’ అంటూ అందరికీ ధైర్యం చెప్పింది.