తెలంగాణ ప్రభుత్వం ఇల్లులేని నిరుపేదలకు, అర్హులైన డబుల్ బెడ్ రూం ఇళ్ళను కట్టిస్తోంది. అయితే వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవడం ఎలాగో చాలామందికి తెలియడంలేదు. సరైన సమాచారం అందక పేద ప్రజలు ఉంటే, అర్హులుకాని వారు దరఖాస్తు చేసుకుంటూ లబ్ధిపొందుతున్నారు. అయితే పేదల కోసం ప్రవేశపెట్టిన పథకం కాబట్టి అర్హులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విన్నవించుకుంటున్నారు. డబుల్ బెడ్ రూంల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే….
Double-Bed-Room-Houses-Telangana
డబుల్ బెడ్ రూంలకు అర్హత కలిగిన వారు దగ్గరలోని మీ- సేవా కేంద్రాన్ని సంప్రదించండి.
మీ-సేవాలో దరఖాస్తు ఫారం తీసుకొని, అందులో మీ పూర్తి వివరాలను పొందుపరచాలి.
ఆ అప్లికేషన్ ఫారంతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యురిటీ కార్డ్ లను జతపరచాలి.
కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డ్ ఉంటే మరీ మంచిది.
ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ లో ప్లాట్ నెంబర్, ఇంటి నెంబర్ ఉండేలా చూస్కోండి.
డబుల్ బెడ్ రూంకోసం అప్లై చేసుకున్న వారి ఆధార్ నెంబర్, వారి వయసు, సంవత్సర ఆదాయం మరియు తమ సెల్ ఫోన్ నెంబర్ ను తెలియజేయాలి.
ఏ గ్రామం, మండలం, కాలనీ, డివిజన్, ల్యాండ్ మార్క్ ఎక్కడ, లొకాలిటీ వంటి అంశాలను మిస్ చేయకుండా తెలపాలి.
సెల్ ఫోన్ ఉన్న వారు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను పొందుపరచాలి.
ఇంతకుముందు ప్రభుత్వ పెన్షన్స్, ఇల్లు పొందినవారైతే అందులో క్లియర్ గా మెన్షన్ చేయాలి.
ఇదంతా పూర్తయిన మీ-సేవా కేంద్రాలలో ఇస్తే, వారు పరిశీలించి ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారం, ఫోటోలను అప్లోడ్ చేసి ఇంకా వేరే వివరాలు ఉంటే నింపుతారు.
ఈ ప్రక్రియను ఆన్ లైన్ లో చేసినందుకు రూ.25 చెల్లించవలసి ఉంటుంది.