ఎక్కడికైనా తీసుకెళ్లేలా ఫోన్లు పలురకాలుగా ముస్తాబవుతున్నాయి గానీ.. వాటిని ఎక్కడైనా చార్జ్చేసే పవర్ బ్యాంకులు మాత్రం పాత పద్ధతిలోనే ఉంటున్నాయేంటి అనుకుంటున్నారా? అయితే, మీ కోసమే షావోమి సరికొత్త పవర్‌బ్యాంక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది! దాని పేరు ‘20000 ఎంఏహెచ్ 22.5 వాట్స్ కాంపాక్ట్’ పవర్‌బ్యాంక్. పేరుకు తగ్గట్టుగానే ఇది ట్రెండీగా కనిపిస్తుంది. బిల్ట్ ఇన్ యూఎస్బీ-సి కేబుల్ దీంట్లోని ప్రత్యేకత. దీంతో టైప్-సీ డివైజ్ ఏదైనా నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. పవర్ బ్యాంకుకి ఉన్న రెండు యూఎస్బీ పోర్ట్‌లతో ఒకేసారి రెండిటిని చార్జ్ చేసే వీలుంది. దీన్ని ముఖ్యంగా ఎక్కువ గ్యాడ్జెట్లు వాడే వాళ్లనీ, ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండేవారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. సాధారణంగా పవర్బ్యాంక్లతోపాటు అదనపు కేబుల్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ, ఈ షావోమి పవర్‌బ్యాంక్‌కు బిల్ట్-ఇన్ యూఎస్బీ-సి కేబుల్ ఉండటం వల్ల ఆ ఇబ్బంది ఉండదు. ఈ కేబుల్ పవర్ బ్యాంక్‌లోనే చక్కగా అమరి ఉంటుంది. ఇది డివైజ్‌లను చార్జ్ చేయడానికి, అలాగే పవర్‌బ్యాంక్‌ను రీచార్జ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ధర: రూ.2,000.
దొరుకు చోటు: ఎంఐ.కామ్
ఎక్కువగా లాంగ్ జర్నీలు చేస్తుంటారా? అయితే, ఇది మీ కోసమే! ‘క్విబో డ్యాష్‌క్యామ్ ప్రో 3కే’. కారు డ్యాష్ బోర్డుపైన అమర్చుకుని హ్యాపీగా వాడుకోవచ్చు. రోజురోజుకూ రోడ్లపై వాహనాల రద్దీ పెరుగుతున్నది. చిన్న ప్రమాదం జరిగినా.. తప్పు ఎవరిది అనేది తేల్చడం కష్టం. అలాంటి సమయాల్లో.. మీ కారులో డ్యాష్‌క్యామ్ ఉంటే మీకు రక్షణగా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఇది మొత్తం రికార్డు చేస్తుంది. దీంతో ఇతరులు మిమ్మల్ని నిందించడానికి వీలుండదు. సోనీ స్టార్విస్ 2 సెన్సర్‌తో వచ్చిన ఈ డ్యాష్‌క్యామ్.. మంచి క్వాలిటీలో వీడియోలను రికార్డ్ చేస్తుంది. అంటే, ఏదైనా ప్రమాదం జరిగితే నంబర్ ప్లేట్, మనుషుల ముఖాలను కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. 15 నుంచి 20 అడుగుల ముందున్న కారు నంబర్ ప్లేట్లోని వివరాలను కూడా స్పష్టంగా చూపిస్తుంది. రికార్డ్ చేస్తున్న వీడియోని 3.2 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేలో చూడొచ్చు. రికార్డ్ చేసిన వీడియోలను యాక్సెస్ చేయడానికి ప్రత్యేక యాప్ ఉంది. అదే క్విబో ప్రో యాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిటిలోనూ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ధర: రూ.9,990.
దొరుకు చోటు: క్విబోవరల్డ్కామ్
దేశీయ మార్కెట్లో కొత్త బ్రాండ్ అడుగుపెట్టడానికి సిద్ధమైంది! ఏఐ ప్లస్ తన మొదటి స్మార్ట్ఫోన్లు ‘పల్స్, నోవా 5జీ’ లను మొబైల్ ప్రియులకు పరిచయం చేస్తున్నది. ఇవి పూర్తిగా దేశీయంగా తయారైన స్మార్ట్ఫోన్లు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఏఐ ఫీచర్స్. భారతీయుల అవసరాలకు తగిన ఫీచర్లను NxtQuantum OS తో సిద్ధం చేశారు. ‘ఏఐ ఇంజిన్’ సపోర్ట్‌తో మరిన్ని భిన్నమైన ఫీచర్స్‌ని పరిచయం చేస్తున్నది. స్మార్ట్ఫోన్లు రెండూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చాయి. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉండటం మరో ప్రధాన ఆకర్షణ. అంతేకాదు.. 1టీబీ వరకూ ఎక్స్టర్నల్ మెమరీని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్ డేటా మొత్తం మన ఇండియన్ సర్వర్లలోనూ (గూగుల్ క్లౌడ్‌లో) నిక్షిప్తం అవుతుంది.
ధర: రూ.5,000 (ప్రారంభం).
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్
ఆరోగ్యంపై నిఘా ఉంచాలనుకుంటున్నారా? స్టయిలిష్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే హువావే సరికొత్త వాచ్ ‘ఫిట్ 4 సిరీస్’ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ సిరీస్‌లో వాచ్ ఫిట్ 4, వాచ్ ఫిట్ 4 ప్రో మోడల్స్ ఉన్నాయి. రెండూ AMOLED డిస్ప్లేలు, SpO2 సెన్సర్లు, 10 రోజుల వరకు ఉండే బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి. అల్యూమినియం ఫ్రేమ్, నైలాన్ లేదా ఫ్లోరోఎలాస్టోమర్ స్ట్రాప్లతో మణికట్టుపై మాయాజాలం చేసేందుకు సిద్ధమైపోయాయి. రెండిటి డిస్ప్లే పరిమాణం.. 1.82 అంగుళాలు. రెండు మోడల్స్‌లోనూ రొటేటింగ్ క్రౌన్గా పనిచేసే హోమ్ బటన్ ఉంది. దీంతోపాటు నేవిగేషన్ కోసం అదనపు సైడ్ బటన్ని వాడొచ్చు. సెన్సర్ల విషయానికొస్తే.. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, బారోమీటర్, టెంపరేచర్ సెన్సర్, ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రామ్).. ఇంకా చాలానే ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ కవచం ఉండటంతో వాచ్‌లు వర్షంలో తడిసినా ఏమీ కాదు. 40 మీటర్ల లోతు వరకు డైవింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ధర: రూ.12,999 (ప్రారంభం).
దొరుకు చోటు: అమెజాన్.కామ్