20 years of TRS | CM KCR | తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ 60 సీట్లతో గెలిచింది. అది బొటాబొటి మెజారిటీయే. ఇదే అదనుగా, తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన ఒక ఆంధ్రా నాయకుడు ఢిల్లీలో మళ్లీ కుతంత్రాలు మొదలుపెట్టాడు. రెండు రాష్ట్రాలనూ మళ్లీ విలీనం చేయాలనీ ఢిల్లీలో పైరవీ ప్రారంభించాడు. కేసీఆర్ పట్ల సానుకూలతతో ఢిల్లీలోని ఈ సమాచారాన్ని అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌కు చేరవేశారు.
తెలంగాణను రాజకీయంగా సుస్థిర పరచడమే ఈ సమస్యకు అంతిమ పరిష్కారమని కేసీఆర్ అప్పుడే నిర్ణయించుకున్నారు. పైకి ఫిరాయింపుల్లా కనిపించే రాజకీయ పునరేకీకరణ వెనక ఇంత కథ దాగి ఉంది. ఎందుకంటే, తెలంగాణను విఫల ప్రయోగంగా చూపించాలన్న కసి అప్పటికీ కొందరు నేతల్లో ఉండింది. తెలంగాణ విఫలమై ఉంటే నష్టం తెలంగాణకే కాదు; దేశవ్యాప్తంగా అస్తిత్వ పోరాటాలు అంతమైపోయేవి. తెలంగాణను సఫలం చేయడం ద్వారా చిన్న రాష్ట్రాలు నిలదొక్కుకుంటాయనే భూమికను కేసీఆర్ కల్పించారు.
హరితహారం ఉద్యమం కొనసాగాలంటే నిరంతరం నిధుల లభ్యత ఉండాలి. ఇందుకోసం తెలంగాణ హరిత నిధిని ప్రతిపాదిస్తున్నా. ఇది మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తది. ఇక్కడ డబ్బు విలువ కాదు, ‘సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్’ ముఖ్యం.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు