ఇంట్లో కంప్యూటర్, టీవీ, ప్రింటర్, స్పీకర్లు.. ఇలా వస్తువులు పెరిగేకొద్దీ ప్లగ్ పాయింట్ల కోసం వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. పైగా ఫోన్ల కోసం అడాప్టర్లు ఎక్కడ పెట్టామో గుర్తుండదు. ఈ సమస్యలన్నిటినీ తీర్చేస్తూ, మీ డెస్క్‌ను ఓ పవర్ హబ్‌లా మార్చేందుకు GM 3329 సర్జ్ ప్రొటెక్టర్ ఎక్స్టెన్షన్ బోర్డ్ వచ్చేసింది. ఇది చూడటానికి చాలా స్టయిలిష్‌గా ఉండటమే కాదు, ఫీచర్ల విషయంలోనూ అదరగొడుతోంది. ఇందులో ఏకంగా 8 ఇంటర్నేషనల్ సాకెట్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని ఏ దేశపు ప్లగ్ పిన్ అయినా ఇందులో ఇట్టే ఫిట్ అయిపోతుంది. దీనికి తోడు 2 యూఎస్బీ టైప్-ఏ పోర్టులు, మరో ఆధునిక టైప్-సీ పోర్ట్ కూడా ఉన్నాయి. దీంతో అడాప్టర్లు అవసరం లేకుండా.. నేరుగా కేబుల్ పెట్టి మీ ఫోన్లు, ట్యాబ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం 11 డివైజ్‌లను ఒకేసారి దీనికి కనెక్ట్ చేసే వీలుంది. భద్రత విషయంలోనూ ఇది నంబర్ వన్. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల మీ ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవకుండా ఇందులో ‘సర్జ్ ప్రొటెక్షన్’ ఉంది. ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ వల్ల ఎక్కువ లోడ్ పడితే ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇందులో ‘చైల్డ్ సేఫ్టీ షట్టర్స్’ కూడా ఇచ్చారు. ఇంట్లో ఆఫీస్ సెటప్ ఉన్నవారికి, ఎక్కువ గ్యాడ్జెట్లు వాడేవారికి ఇది ఓ పర్ఫెక్ట్ ఛాయిస్.
ధర: రూ. 1,119 (ఆఫర్లను బట్టి మారుతుంది)
దొరుకు చోటు: అమెజాన్
మెడలో ఏసీ

అప్పుడే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఎండలు మరింతగా మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే చెమటలు పట్టేస్తున్నాయి. బస్సులో వెళ్తున్నప్పుడు, వంటగదిలో పని చేస్తున్నప్పుడు ఫ్యాన్ గాలి సరిగ్గా తగలక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ఈ తిప్పలు తప్పాలంటే.. మీవద్ద One94Store బ్లేడ్లెస్ నెక్ ఫ్యాన్ ఉండాల్సిందే! దీని స్పెషాలిటీ ఏంటంటే.. చూడటానికి హెడ్ఫోన్స్లా ఉంటుంది. జస్ట్ మెడకు తగిలించుకుంటే చాలు. మీరు ఎక్కడికి వెళ్లినా మీతోనే ఉంటూ.. మీ ముఖం చుట్టూ చల్లటి గాలిని వీస్తుంటుంది. ఇందులో రెక్కలు ఉండవు. కాబట్టి జుట్టు చిక్కుకుపోతుందనే భయం లేదు. 12 ఎయిర్ అవుట్‌లెట్స్ ద్వారా గాలి అన్ని వైపుల నుంచి సమానంగా వస్తుంది. గాలి వేగాన్ని తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి 5 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందులో 2400ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 6 గంటల పాటు వాడుకోవచ్చు.
ధర: రూ. 599
దొరుకు చోటు: అమెజాన్
సోప్ కోసం స్పెషల్‌గా..

ఊర్లకు వెళ్లినప్పుడో, హోటళ్లలో ఉన్నప్పుడో.. అక్కడ ఇచ్చే సబ్బులు మనకు పడకపోవచ్చు. అందుకే అలవాటైన సబ్బునే వెంట తీసుకెళ్లాలనుకుంటాం. కానీ, వాడిన తడి సబ్బును కవర్లో పెడితే అది కరిగిపోయి ముద్దగా మారుతుంది. పైగా బ్యాగులో ఉన్న ఇతర వస్తువులకు అంటుకుంటుంది. ఈ చిరాకు లేకుండా, మీ సబ్బును ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచడంలో Travel Soap Box with Lid అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని ‘లీక్-ప్రూఫ్’ డిజైన్ వల్ల మూత చాలా గట్టిగా ఫిట్ అవుతుంది. సబ్బును వాడిన తర్వాత ఇందులో పెట్టి మూత పెడితే.. అందులోని తడి బయటికి రాదు. దీంతో మీ ప్రయాణాల్లో సూట్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్ పాడయ్యే ప్రసక్తే ఉండదు. గట్టి ప్లాస్టిక్‌తో తయారుకావడం వల్ల త్వరగా విరిగిపోదు. ప్రయాణాలకే కాదు.. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో వారి సబ్బులను విడిగా, హైజెనిక్‌గా దాచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉండే ఈ సోప్ బాక్సులు.. మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
ధర: రూ. 199 (2 బాక్సుల ప్యాక్)
దొరుకు చోటు: అమెజాన్
ఇంట్లోనే సంజీవని!

వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వృద్ధులకు మందులు వేయడం కంటే నెబ్యులైజేషన్ ద్వారా మందును నేరుగా ఊపిరితిత్తుల్లోకి పంపడం వేగవంతమైన ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ అవసరం కోసం ప్రతిసారీ క్లినిక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సురక్షితంగా ఇంట్లోనే వాడుకునేలా AGEasy నెబ్యులైజింగ్ మెషిన్ వచ్చేసింది. ఇది మందును చాలా సన్నని కణాలుగా మారుస్తుంది. దీంతో మందు శరీరంలోకి త్వరగా ఇంకిపోయి, తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి సౌండ్ లేకుండా పనిచేస్తుంది. ఇందులో 7 ఎంఎల్ మందు నింపుకోవచ్చు. ఆవిరి వేగాన్ని మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ లోపల ఉన్న బుజ్జి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మాస్క్‌లు, ట్యూబులు వంటివి జాగ్రత్తగా దాచుకోవచ్చు. ఇందులో ‘స్మార్ట్ షట్‌డౌన్’ ఫీచర్ ఉండటం వల్ల మెషిన్ వేడెక్కితే ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ ప్రొడక్ట్ కావడంతో నాణ్యత విషయంలో భయం అక్కర్లేదు.
ధర: రూ. 1,099
దొరుకు చోటు: అమెజాన్ (ఆఫర్లను బట్టి మారుతుంది)