శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘ఆస్మాన్’ పేరుతో ఓ చిత్రం రూపొందనున్నది. మేఘాంశ్ శ్రీహరి ఇందులో కథానాయకుడు. రామ్నందన్ దర్శకుడు. కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సాయిదుర్గతేజ్ క్లాప్ ఇవ్వగా, సందీప్‌కిషన్ కెమెరా స్విచాన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని నిర్మాత, దర్శకులకు అందించారు. చిత్ర దర్శకుడు రామ్నందన్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఇంకా హీరోలు విశ్వక్సేన్, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. రామ్నందన్ అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, తాము బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నామని హీరో మేఘాంశ్ శ్రీహరి నమ్మకం వ్యక్తం చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా సినిమా రానున్నదని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: షోయబ్, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి.