వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యం సన్నగిల్లుతుంది. కానీ, ఒక్కోసారి మన దురలవాట్లు ముదిమిని ముందుగానే తీసుకొస్తాయి. సిగరెట్, మద్యంతో గుండె ధమనులు గట్టిపడటం అన్నది కూడా అలాంటి సమస్యేనని అంటున్నారు పరిశోధకులు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ప్రతినిధులు ఈ నివేదికను వెలువరించారు. ఇందుకోసం వారు 17-24 ఏండ్ల లోపు 1,655 మందిని ఎంచుకున్నారు. వారిలో మద్యం, సిగరెట్ అలవాట్లను బట్టి వేర్వేరు బృందాలుగా విభజించారు. ఈ అలవాట్లు వారి ధమనుల మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో గమనించారు. దురదృష్ట
వశాత్తు… ఈ రెండు అలవాట్లూ చిన్నవయసులోనే ధమనులను పాడుచేస్తున్నాయని తేలింది. అలవాటు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా నష్టం కనిపించింది. కానీ, సిగరెట్ మానేసినవారి ధమనులు తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకోవడం శుభ పరిణామం.