చండీగఢ్‌కి చెందిన శశి ధీమన్ ఫార్మా రంగంలో పనిచేసేవారు. మనసు మాత్రం స్టాండప్ కామెడీ మీదే ఉండేది. చివరికి మనసు వైపే మొగ్గారు. స్టాండప్ కమెడియన్‌గా అయ్యారు. గత ఏడాది, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున తాను చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. శశి సత్తా చాటాయి. ఆమెకు చిన్నప్పటి నుంచీ స్టేజ్ ఎక్కాలనే ఆరాటం ఎక్కువ. నలుగురినీ నవ్వించడం మహా ఇష్టం. ఆ తపనే స్టాండప్ కమెడియన్‌గా మార్చేసింది.
శశి దృష్టిలో హాస్యం మనసు సేద తీర్చే మంత్రం. ఎన్నో ఒత్తిడుల మధ్య బతుకుతున్నవారికి కించిత్ ఉపశమనం ఇచ్చే మందు. అందుకే ప్రతి ప్రదర్శనా కొత్తగా ఉండాలని తపిస్తారామె. ప్రేక్షకుల నేపథ్యాల్ని బట్టి తన జోకులు, పంచులు మారిపోతూ ఉంటాయి. ‘నేను ఏక వ్యక్తి స్టార్టప్లాంటి దాన్ని’ అని నవ్వేస్తారు శశి. ‘స్టాండప్ కామెడీ కత్తిమీద సామే. అలా అని దాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకునేవారు వెనకడుగు వేయనవసరం లేదు’ అని భరోసా ఇస్తారు. ‘ఓ అయిదు నిమిషాలకు సరిపడా జోక్స్ రాసుకుని, మైక్ అందుకుని నిర్భయంగా ప్రదర్శన ఇచ్చేస్తే… అదే అలవాటైపోతుంది’ అంటూ రేపటి స్టాండప్ కమెడియన్లకు గెలుపు చిట్కా చెబుతారు.