కళాత్మక వ్యాపార సంస్థ ‘ఇర్షిక హ్యూ’ ఇంటీరియర్ డిజైనింగ్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నది. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నది. ఆ కంపెనీ వ్యవస్థాపకురాలు కల్పనా రావ్కుజీవం లేని గోడలే క్యాన్వాసులు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో విద్యాభ్యాసం తర్వాత ఆర్ట్ప్రెన్యూర్ అవతారం ఎత్తారు కల్పన. తన నైపుణ్యాలకు రంగులు అద్దుకుంటూ వ్యాపారవేత్త స్థాయికి చేరారు.
ఇర్షిక హ్యూ.. సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలైంది. ఇంటీరియర్ డిజైనింగ్‌తోపాటు వాల్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ తదితర ప్రక్రియలతో కస్టమర్ల మనసు దోచుకుంటున్నా. బాల్యం నుంచీ ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వెంటాడేది. ఆ కొత్తదనాన్ని కనుక ఓ వ్యాపార వస్తువుగా తీర్చిదిద్దగలిగితే.. ఆర్థిక ప్రయోజనం తోడవుతుంది. దీనివల్ల మనం లాభపడతాం. కష్టమర్లు సంతృప్తి చెందుతారు. కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక, కళాత్మక వ్యాపారం మాది. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజిజెస్లో చేరాను. నా కలను నిజం చేసుకోడానికి ఆ వేదిక ఎంతో ఉపయోగపడింది.
ఐఎస్బీలో చేరకముందు నుంచీ నాకు కుంచె పట్టే అలవాటు ఉంది. మా అమ్మ లావణ్య చక్కగా పెయింటింగ్స్ వేస్తారు. తన ప్రోత్సాహంతో నేనూ కుంచె అందుకున్నాను. నాకు తెలిసిన కళనే వ్యాపారంగా ఎంచుకున్నాను. నాలోని సృజనను ఇంటీరియర్ డిజైనింగ్కూ జోడించాను. ఆర్టిస్ట్ క్యాన్వాస్ మీద తన భావాలను అద్దుతారు. నేను ఓ అడుగు ముందుకేసి.. ఇంటినే క్యాన్వాస్గా భావిస్తాను. ఎన్ని రంగులతో, ఎంత అందంగా తీర్చిదిద్దాలో ఆలోచిస్తాను. కాబట్టే, అడుగుపెట్టిన కొద్ది రోజులకే నా వ్యాపారం పుంజుకున్నది. ఈ కామర్స్ వేదికగా కూడా విస్తరించాను. వాల్ పెయింటింగ్స్, దీపం దివ్వెలు, గ్లాస్‌వేర్ హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఫొటోఫ్రేమ్స్ కస్టమర్ అభిరుచికి నచ్చినట్లుగా రూపొందిస్తాను. ఆఫీస్‌కే పరిమితం కాకుండా.. ఎగ్జిబిషన్స్‌లో ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేస్తూ కొత్త కస్టమర్స్‌ను ఆకట్టుకుంటున్నాను. ఒక్కసారి నాతో పరిచయం అయితే చాలు.. ఆ అనుబంధం జీవితకాలం కొనసాగుతుంది. ‘కస్టమర్ ఫస్ట్’ నినాదానికి నేను ప్రాధాన్యం ఇస్తాను.
హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఇంటిని అందంగా, సమకాలీనంగా తీర్చిదిద్దుకోడానికి చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. మా డిజైనర్ పెయింటింగ్స్‌కు వైవిధ్యంగా గ్లాస్ పెయింటింగ్ ప్రక్రియను జోడించడం ద్వారా.. గృహాలంకరణలో సరికొత్త ప్రయోగం చేస్తున్నాను. అదే నా విజయ రహస్యంగా మారింది. ప్రస్తుతం కస్టమర్లు ఇంటీరియర్ డిజైనింగ్‌తోపాటు గ్లాస్‌వేర్ పెయింటింగ్‌కూ ప్రాధాన్యం ఇనిస్తున్నారు. తాజాగా ఆర్కిటెక్చువల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ పట్ల సంపన్నులు ఆసక్తి చూపుతున్నారు. ఇల్లు కట్టుకున్నాక.. ఇంటీరియర్ డిజైనింగ్ గురించి ఆలోచించడం కాదు. ప్రాజెక్ట్ ఆరంభంలోనే.. నచ్చిన ఇంటీరియర్స్‌కు అనుగుణంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. మాలాంటివారి సలహాలు తీసుకుంటున్నారు.
నా సృజనాత్మక నైపుణ్యాన్ని పది మందికి పరిచయం చేస్తున్నాను. పలు బస్తీల్లో మహిళలకు పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. ఆ కళతో దాదాపు వంద మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వారి ఆసక్తిని బట్టి సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకూ సహకరిస్తాను. నాబార్డ్, సిడ్బీ, ఎస్బీఐ లాంటి సంస్థలు నిర్వహించే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నా. నా చొరవతో మారిన ప్రతి జీవితమూ నా దృష్టిలో ఒక ఘన విజయమే.
పెన్యూర్స్ (కోవె)లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఆ సంస్థతో అనుబంధం నాకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. కోవె కార్యవర్గంలో చేరకముందు అందులోని చాలామంది సభ్యులు మా కస్టమర్లే. అలా పదేళ్ల ప్రయాణం తర్వాత సభ్యురాలిగా అడుగుపెట్టాను. వ్యవస్థలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే బయటనుంచి సలహాలు, సూచనలు ఇస్తే సరిపోదు. ఆ వ్యవస్థలో భాగం కావాలి. అందులో మనల్ని మనం చూసుకోవాలి. అప్పుడే మన ప్రయత్నం మరింత ఆ ప్రభావవంతంగా కార్యరూపంలోకి వస్తుంది. సమాజంలోని ప్రతి సమస్యనూ మనం పరిష్కరించలేక పోవచ్చు. కానీ మన వంతుగా సాయం చేయగలం.
– కడార్ల కిరణ్
– సి.ఎం. ప్రవీణ్