కోట్లాది ప్రజల సిస్టర్
బ్రహ్మకుమారి సిస్ట్టర్ శివాని.. నవతరం ఆధ్యాత్మిక గురువు. ఆమె ఉపన్యాసాల్లో కొరుకుడు పడని పదజాలం ఉండదు. మార్మికత కనిపించదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుతి మెత్తగా చెబుతారు. హెచ్చరించాల్సిన సందర్భాల్లోనూ ఆ స్వరంలో మాతృత్వపు మమకారం తొంగి చూస్తుంది.
బ్రహ్మకుమారి సిస్ట్టర్ శివాని.. నవతరం ఆధ్యాత్మిక గురువు. ఆమె ఉపన్యాసాల్లో కొరుకుడు పడని పదజాలం ఉండదు. మార్మికత కనిపించదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుతి మెత్తగా చెబుతారు. హెచ్చరించాల్సిన సందర్భాల్లోనూ ఆ స్వరంలో మాతృత్వపు మమకారం తొంగి చూస్తుంది. వివిధ ఆన్లైన్ మాధ్యమాల్లో ఆమెకు కోటిమందికి పైగా అభిమానులు ఉన్నారు. తను గురుగ్రామ్‌లో పుట్టిపెరిగారు. బాగా చదువుకున్నారు. చిన్న వయసులోనే రాజయోగ పట్ల ఆకర్షితురాలై బ్రహ్మకుమారి సంస్థలో చేరారు.
‘ఓ గొప్ప సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లే అవకాశం నాకు లభించింది’ అంటారామె. మొదట్లో శివాని తన తల్లిని రోజూ స్కూటర్ మీద రాజయోగ క్లాసులకు తీసుకెళ్లేవారు. క్రమంగా తానూ ఆ పరివారంలో భాగమయ్యారు. మౌంట్ అబూ వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నారు. శివాని దినచర్య తెల్లవారు జామున మూడు గంటలకు మొదలవుతుంది. ‘మనల్ని మనం తీర్చిదిద్దుకునే శక్తి ఒక్క ఆధ్యాత్మికతతోనే వస్తుంది’ అంటారామె. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రిక సిస్టర్ శివానికి ‘మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్’ పురస్కారం ఇచ్చింది.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

