జర్నా గార్గ్ నవ్వును తేలిగ్గా తీసుకోకండి. కోటి ఇరవై లక్షలమంది ఫాలోయర్స్ ఉన్న సెలెబ్రిటీ ఇన్ఫ్లు యెన్సర్ ఆమె. ముగ్గురు పిల్లల్ని కని, పెంచి, పెద్దచేసిన తర్వాత.. స్టాండప్ కామెడీని సీరియస్ బిజినెస్‌గా తీసుకున్నారు. గార్గ్ గతంలో చాలా వ్యాపారాలే చేశారు. టూత్‌బ్రష్‌లు అమ్మారు. వీగన్ రెస్టారెంట్ నిర్వహించారు. పెళ్లిసంబంధాలు కుదిర్చే పనీ చేపట్టారు. వంటిల్లు, భోజనం, భర్త, పిల్లలు, అత్తమామలు, కొత్త కోడలు, బంధుగణం.. ఇవే గార్గ్ హాస్యానికి ముడిసరుకు. అందుకే అంతర్జాతీయ అభిమానులు ఆమెను ‘ఇండియన్ మామ్’ అని పిలుస్తారు. ఆమె అభిమానుల్లో సెలెబ్రిటీలూ ఉన్నారు.
‘వీఐపీలతో సమావేశం నాకు పెద్దగా కిక్ ఇవ్వదు. టికెట్లు కొని మరీ నా షోకు వచ్చే అపరిచిత అభిమానులంటేనే ఇష్టం’ అంటారు గార్గ్.తను ముంబైలో పుట్టి పెరిగారు. పద్నాలుగేండ్ల వయసులో తల్లిని కోల్పోయారు. దీంతో తండ్రి తన కూతురికి పెండ్లి చేద్దామనుకున్నారు. గార్గ్‌కు ఆ నిర్ణయం నచ్చలేదు. ఇంట్లోంచి బయటికి వచ్చేశారు. తనకంటూ ఓ కెరీర్ నిర్మించుకున్నారు. న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ మధ్యలోనే పెండ్లి, భర్త, పిల్లలు. అమెరికా కాపురం.