అదితి అనుజ్ చేతిలో కాగితం పడిందంటే.. కళాఖండంగా మారినట్టే. జపనీస్ ఆర్ట్ ‘ఒరిగామి’లో ఆమె ఆరితేరింది. షాపుల అలంకరణకు, పండుగలు, ప్రత్యేక దినాల్లో మాల్స్, ఇళ్లు, ఆఫీసుల ముస్తాబుకు భారీ పరిమాణంలో కాగితపు కళాఖండాలను తయారు చేస్తుంది అదితి. భవనం డిజైన్‌ను బట్టి అలంకరణ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం తన ప్రత్యేకత.
కొందరు మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నది అదితి. తనది రాజస్థాన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో చదివింది. ఒరిగామి.. బేసిక్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్‌లో శిక్షణ కూడా ఇస్తున్నది.