Black hole: భూమికి సమీపంగా బ్లాక్‌హోల్.. ఇది సూర్యుడి కంటే పది రెట్లు పెద్దది.
సూర్యుడి కంటే పది రెట్లు పెద్దది ఈ బ్లాక్‌హోల్
భూమికి దగ్గరగా వచ్చిన ఒక బ్లాక్‌హోల్(కృష్ణ బిలం) ని పాలపుంతలో గుర్తించారు బ్రిటన్‌కి చెందిన అంతరిక్ష పరిశోధకులు. ఇంటర్నేషనల్ జెమిని అబ్జర్వేటరీ సాయంతో వీళ్లు దీన్ని గుర్తించారు. పాలపుంతలో ఒక బ్లాక్‌హోల్‌ని గుర్తించడం ఇదే మొదటిసారి. దీనికి గయియ బిహెచ్ 1 (Gaia BH1) అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 1600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే, గతంలో వాటికంటే ఈ బ్లాక్‌హోల్ మూడు రెట్లు వేగంగా భూమివైపు దూసుకొస్తున్నదని చెప్తున్నారు. ఈ బ్లాక్‌హోల్ సూర్యుడి కంటే పది రెట్లు పెద్దగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు, దీని ద్రవ్యరాశి సుర్యుడి ద్రవ్యరాశి కంటే దాదాపు ఐదు నుంచి వంద రెట్లు ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
నాలుగేళ్ల ప్రయత్నం తర్వాత
‘నేను గత నాలుగేళ్లుగా సుప్తావస్తలో ఉన్న బ్లాక్‌హోల్‌ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈసారి నా ప్రయత్నం విజయవంతం అయింది’ అని చెప్పారు ఇఐ బాడ్రీ అనే ఆస్ట్రోఫిజిస్ట్. ఈయన తన టీంతో కలిసి ఈ బ్లాక్‌హోల్‌ని గుర్తించారు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఆస్ట్రోనమీ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఈ బ్లాక్‌హోల్ గురించిన విషయాల్ని రాయల్ ఆస్ట్రోనామిక్ సొసైటీ నోటిస్లో ప్రచురించారాయన.
బ్లక్హోల్స్ ఇలా ఏర్పడతాయి
ఏదైనా ఒక నక్షత్రం దాని గురుత్వాకర్షణ శక్తిని కోల్పోవడం వల్ల బ్లాక్‌హోల్స్ ఏర్పడతాయి. ఒక పాలపుంతలో ఇలాంటివి పది కోట్లకు పైగా ఉంటాయంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. వీటిని విలన్స్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇవి వెలుతురుని తమగుండా ప్రసరించనీయవు. అందుకనే వీటికి కృష్ణ బిలం అనే పేరొచ్చింది.
Read Today's Latest Study-material Study-material News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

