Zimbabwe Cricket : జింబాబ్వే సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (Sean Williams)కు ఆ దేశ బోర్డు ఊహించని షాకిచ్చింది. ఇకపై అతడు దేశానికి ఆడే అర్హత కోల్పోయాడని స్పష్టం చేసింది. అనారోగ్యం సాకుతో టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో దేశానికి ఆడకపోవడమే అతడు చేసిన పెద్ద పొరపాటు. ఆ తప్పును సీరియస్‌గా తీసుకున్న బోర్డు ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. ఇకపై మరెవరూ అలాంటి తప్పు చేయకుండా విలియమ్స్‌ను సెలెక్షన్‌కు పరిగణించబోమని గట్టి సందేశం ఇచ్చింది. తన విషయంలో బోర్డు తీసుకున్న ఊహించని నిర్ణయంతో విలియమ్స్ కంగుతిన్నాడు.
అసలేం జరిగిందంటే.. స్వదేశంలో అక్టోబర్‌లో జరిగిన పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్ (T20 World Cup Africa Qualifier) లో సీన్ విలియమ్స్ ఆడాల్సింది. కానీ, అతడు అనారోగ్యం సాకుతో రీహాబిలిటేషన్ సెంటర్లో చేరాడు. డ్రగ్ టెస్టు సమయంలో అతడు ఉద్దేశపూర్వకంగానే అందుబాటులో లేడు. అయితే.. ఆ తర్వాత అంతర్గత విచారణలో విలియమ్స్ డ్రగ్స్‌కు బానిసైనట్టు తెలిసింది. అయినా సరే.. అతడు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడడంతో బోర్డు మండిపడింది.
Williams in rehab after withdrawing from national duty
Details 🔽https://t.co/PdLCiwBeiX pic.twitter.com/tifysdRPpA
— Zimbabwe Cricket (@ZimCricketv) November 4, 2025
‘కాంట్రాక్ట్ క్రికెటర్లు నిబద్ధతతో ఉండాలి. బోర్డు నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలి. క్రమశిక్షణతో మెలగడం, జట్టు టైమ్ టేబుల్‌ను, డ్రగ్స్ నిరోధక విధానాలను పాటించడం చాలా ముఖ్యం. విలియమ్స్ చాలాసార్లు క్షమశిక్షణ తప్పాడు. అతడు వరల్డ్ కప్ ఆఫ్రిక క్వాలిఫయర్స్‌కు అందుబాటులో లేకపోవడం జట్టు ఎంపికపై ప్రభావం చూపింది. అతడిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న బోర్డు పట్ల విధేయుడిగా లేకపోవడమే కాదు జట్టు సమతుల్యతను దెబ్బతీశాడు విలియమ్స్. అందుకే అతడి కాంట్రాక్ట్‌ను ఇక పొడిగించం. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదిన విలియమ్స్ కాంట్రాక్ట్ ముగియనుంది. ఇకపై అతడిని జాతీయ జట్టులోకి తీసుకోం’ అని జింబాబ్వే క్రికెట్ వెల్లడించింది.
🚨 CAREER ENDED DUE TO DRUG ADDICTION 🚨
– Zimbabwe’s 🇿🇼 Sean Williams has disclosed that he has been struggling with drug addiction 💉
– Now, Zimbabwe Cricket Board have decided that the 39-year-old will never be picked again 😨
– What’s your take 🤔 pic.twitter.com/xi42fNAC9c
— Richard Kettleborough (@RichKettle07) November 4, 2025
ఉద్దేశపూర్వకంగానే జట్టుకు అందుబాటులో లేనందుకు విలియమ్స్ కెరీర్‌ను ముగించిన జింబాబ్వే క్రికెట్ అతడి సేవల్ని కొనియాడింది. ‘గత రెండు దశాబ్దాలు అతడు జట్టుకు గొప్ప సేవలు అందించాడు. అద్బుతంగా ఆడి గొప్ప విజయాల్లో భాగమయ్యాడు. అతడి భవిష్యత్ విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నాం’ అని జీసీ పేర్కొంది. ఇప్పటివరకూ టెస్టుల్లో 1,941 పరుగులు, వన్డేల్లో 5,217 రన్స్.. టీ20ల్లో 1,805 పరుగులు సాధించాడు విలియమ్స్.