హరారె: దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్నా.. ఇప్పటికీ పసికూనగానే ఉన్న జింబాబ్వే పాకిస్థాన్‌కు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో 19 పరుగులతో గెలిచింది. జింబాబ్వే విసిరిన 119 పరుగులు ఛేదించలేక కేవలం 99 పరుగులకే ఆలౌటైంది పాకిస్థాన్. బాబర్ ఆజం, ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న పాక్ స్వల్ప లక్ష్యాన్ని కూడా చేజ్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన జింబాబ్వే 1-1తో సిరీస్‌ను సమం చేసింది.
కెప్టెన్ బాబర్ ఆజం మాత్రమే 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు కాకుండా మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. ఈ ఓటమిని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. వాళ్ల టీమ్‌పై విరుచుకుపడుతున్నారు. కానీ మిగతా క్రికెట్ అభిమానులు మాత్రం ఈ ఓటమిపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రకరకాల ఫన్నీ వీడియోలను ఈ మ్యాచ్‌కు లింక్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
Misbah UL Haque at Pakistan Cricket team talk tonight after lost the game against Zimbabwe 😂😂#ZIMvPAK #PAKvZIM #BabarAzam #zimvspak #ZIMvsPAK #PAKvsZIM #Pakistan #Cricket #babar_azam
— Abdullah Neaz (@cric_neaz) April 23, 2021
https://t.co/ZC3YL7UQqF