బులవాయొ : జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్ 2-0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో జింబాబ్వే.. 2.4 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ (5/3) ఐదు వికెట్ల ప్రదర్శనతో జింబాబ్వే విలవిల్లాడింది. అనంతరం లక్ష్యాన్ని పాక్.. 5.3 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది.