ZIM vs WI : వెస్టిండీస్ – జింబాబ్వే జట్ల మధ్య బులవాయో స్టేడియంలో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. తగెనరైన్ చందర్‌పాల్ (207) డబుల్ సెంచరీతో రాణించడంతో విండీస్ 447-6 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 379-9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గ్యారీ బ్యాలెన్స్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ దీటుగా ఆడింది. 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఆఖరి రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 134 రన్స్ చేసింది. అసమాన రీతిలో పోరాటం చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చందర్‌పాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.