కాన్పూర్: తొలి టెస్టులోనూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యశస్వి జైస్వాల్.. రెండో టెస్టు(Ind Vs Ban) ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో జాకిర్ క్యాచ్ ఇచ్చాడు. స్లిప్స్‌లో ఉన్న జైస్వాల్ అద్భుతంగా ఆ క్యాచ్ పట్టేశాడు. టీవీ రిప్లేల్లోనూ కష్టంగానే ఆ నిర్ణయాన్ని వెల్లడించాల్సి వచ్చింది. ఓ కోణంలో మాత్రం ఆ బంతి నేరుగా జైస్వాల్ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో జాకిర్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఓపెనర్ జాకిర్ ఇవాళ భారత పేస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాడు. బుమ్రా బౌలింగ్‌లో స్కోర్ చేసేందుకు ఇబ్బపందిపడ్డాడు. 24 బంతులు ఆడిన అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు వెనుదిరిగాడు. 13 ఓవర్లలో బంగ్లా రెండు వికెట్ల నష్టానికి 37 రన్స్ చేసింది. ఇస్లామ్ 24 రన్స్ చేసి ఔటయ్యాడు. శాంతో(8), మొమినుల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి రెండు వికెట్లు ఆకాశ్ దీప్ తీసుకున్నాడు.
Opening breakthrough in Kanpur! 🙌
Yashasvi Jaiswal with an excellent catch at slip and Akash Deep with the wicket 👌👌
Live – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/9dtKt9f5mR
— BCCI (@BCCI) September 27, 2024