Zakary Foulkes : దేశం తరఫున ఆడాలని కలగనని క్రికెటర్ ఉండడు. జాతీయ జట్టు జెర్సీతో మైదానంలోకి దిగిన రోజును జీవితాంతం గుర్తుంటుంది వాళ్లకు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టే ప్రదర్శనతో టీమ్‌ను గెలిపిస్తే ప్రశంసల జల్లు కురవడం ఖాయం. డెబ్యూట్ మ్యాచ్‌లోనే ‘మ్యాచ్ విన్నర్’ అనిపించుకున్న క్రికెటర్లు చాలామందే. ఈ జాబితాలో న్యూజిలాండ్ యువ స్పిన్నర్ జకరీ ఫౌల్కెస్ (Zakary Foulkes) కూడా చేరిపోయాడు.
జింబాబ్వే జరిగిన రెండో టెస్టులో ఆడిన జకర్.. రెండు ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లతో ఔరా అనిపించాడు. తద్వారా కివీస్ తరఫున టెస్టు అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడీ స్పిన్నర్. జకరీ విజృంభణతో నిరుడు దక్షిణాఫ్రికాపై విల్ ఓ రూర్కీ (Will O’Rourke) నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. పేసర్ అయిన రూర్కీ 93 రన్స్ ఇచ్చి 9 వికెట్లు తీయగా.. ఈ స్పిన్ సంచలనం మాత్రం 75కే తొమ్మిది మందిని ఔట్ చేశాడు.
23-year-old Zakary Foulkes makes an impression on Test debut 🔢 pic.twitter.com/dLLsAf4mpC
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2025
క్వీన్స్ స్టోర్స్ క్లబ్ మైదానంలో న్యూజిలాండ్ చరిత్రాత్మక విక్టరీలో భాగమయ్యాడు జకర్. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి జింబాబ్వే కుప్పకూలడంలో కీలకమైన ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరిశాడు. ఈసారి ఏకంగా ఐదు వికెట్లతో అదరగొట్టి కివీస్‌ను గెలుపును తేలిక చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించిన జకరీకి మ్యాట్ హెన్రీ తోడవ్వగా ఆతిథ్య జట్టు విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర(165), ఓపెనర్ డెవాన్ కాన్వే(153) , హెన్రీ నికోల్స్(150) భారీ శతకాలతో రెచ్చిపోయారు. మూడో రోజు 601-3 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కెప్టెన్ శాంట్నర్.
New Zealand make it 2-0 with a monster win pic.twitter.com/3zeObt2Afc
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2025
అనంతరం ఛేదనకు దిగిన జింబాబ్వే కనీస పోరాటం చేయలేకపోయింది. ఆదిలోనే హెన్రీ ఓపెనర్లను ఔట్ చేసి ఒత్తిడి పెంచగా.. మిడిలార్డర్‌ను జకరీ చుట్టేశాడు. దాంతో, ఇన్నింగ్స్ 369 పరుగుల తేడాతో గెలుపొందిన కివీస్ రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్లీప్ చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో కజరీ అందరినీ ఆకట్టుకున్నాడు. 23 ఏళ్ల వయసున్న ఈ స్పిన్ కెరటం కివీస్ తరుపుముక్కగా అవతరిస్తాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.